Jobs : ఇంటర్ తోనే గ్రూప్-B-C ఉద్యోగాలు..!!

తాజాగా ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నది.. ఇక ఈ రోజున జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన అధికారిక వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను, ఖాళీలను, జీతభత్యాలను తెలుసుకుందాం.

Group-B-C jobs with Inter
Group-B-C jobs with Inter

1).మొత్తం ఖాళీల సంఖ్య: 143 పోస్ట్ లు కలవు : ఇందులో గ్రూప్ -B పోస్ట్ లు-121, గ్రూప్ -C పోస్ట్లు-22 కలవు. ఇక పూర్తిగా పోస్ట్ వివరాలు తెలుసుకుంటే..
నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీరింగ్, మెడికల్ లేబరేటరీ (MLT), జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్-NTTC, డెంటల్ మెకానికల్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ లు కలవు.

2). అభ్యర్థుల వయస్సు : ఆసక్తికరమైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు వయసు 27 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

3). అర్హతలు : అభ్యర్థులు పోస్టును బట్టి ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వాటిలో ఇంటర్/డిగ్రీ/డిప్లమా/తత్సమాన అర్హత సాధించి ఉండాలి.

4). జీతభత్యాలు : పోస్టును బట్టి నెలకు రూ.19,900 రూపాయల నుంచి 44,900 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు.

5). ఎంపిక విధానం : అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

6). పరీక్ష తేదీ సమయాలు:

1). నర్సింగ్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ (సివిల్), డెంటల్ మెకానికల్ , జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, పరీక్ష తేదీ ఏప్రిల్-17 ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది.

2). స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, మెడికల్ లేబరేటరీ టెక్నాలజీస్ పోస్టులకు సంబంధించి పరీక్ష ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు.

3). NTTC లో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అడ్మినిస్ట్రేషన్, అసిస్టెంట్ పోస్టులకు.. ఏప్రిల్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 5 :30 నిమిషాల వరకు పరీక్ష తేదీలు జరుగుతాయి.

7). హాల్ టికెట్లు ఏప్రిల్ 11వ తేదీన విడుదల అవుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్.https://jipmer.edu.in/ చూసుకోవాలి.