Great Indian Festival Sale : గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. రూ.49 నుంచి షాపింగ్ చేసి అవకాశం..!!

Great Indian Festival Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే . ఇక ఇందులో 49 రూపాయల నుంచి షాపింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఇకపోతే అమెజాన్ తన యాప్ లో సేల్ యొక్క బ్యానర్ ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇకపోతే ఈ సేల్ ఎంత కాలం కొనసాగుతుంది అనే విషయాన్ని మాత్రం అమెజాన్ స్పష్టం చేయలేదు. ఇకపోతే కంపెనీ సేల్లో అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించడం గమనార్హం. ఇక అమెజాన్ లో ఆఫర్స్ కింద ఫోన్లు, లాప్టాప్ లు, గేమింగ్ పరికరాలు , గృహోపకరణాలు, టీవీలు వంటి ఎన్నో కేటగిరీలను వినియోగదారులు తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఇకపోతే ఆఫర్ల గురించి మాట్లాడుతూ.. ఫెస్టివల్ సేల్ లో కొనుగోలు చేయడానికి కష్టమర్లు ఎస్బిఐ కార్డులను ఉపయోగిస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు మొదటి కొనుగోలుపై 10% క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది. ముఖ్యంగా సాంసంగ్, IQoo, Mi వంటి బ్రాండ్ల సెల్ ఫోన్ లు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే వాటి ధర ఎంత అన్నది మాత్రం ప్రకటించలేదు . గృహాలంకరణ మరియు వంట సామాను అలాగే డైనింగ్ ఉత్పత్తులను రూ.99 ప్రారంభ ధరతో సేల్ మొదలవుతుంది . ఇక అమెజాన్ ఫెస్టివల్ సేల్ మొబైల్స్ అలాగే ఇతర మొబైల్ యాక్సెసరీస్ పై 40 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంచబడ్డాయి.

Great Indian Festival Sale is an opportunity to shop from Rs.49
Great Indian Festival Sale is an opportunity to shop from Rs.49

ఈ సేల్ లో బడ్జెట్ ఫోను ప్రారంభ ధర రూ.5,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక దీంతోపాటు కస్టమర్లు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ ఫ్యాషన్ క్యాటగిరి ప్రారంభ ధర రూ.199 నుంచి మొదలవుతుంది. ఇక ఇందులో రూ.399 లోపు దుస్తులు, రూ.99 తో ప్రారంభమయ్యే బ్యూటీ ప్రొడక్ట్స్, రూ.499 లోపు ఆభరణాలు, రూ. 499 లోపు ఫుట్ వేర్, ఇక మరెన్నో వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇక మొబైల్ యాక్సెసరీస్ కూడా మీకు రూ.49 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే కంప్యూటర్ ఉపకరణాలు, హెడ్ ఫోన్ల ప్రారంభ ధర రూ.129 వద్ద కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.