Government Jobs : విశాఖపట్నంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు 2 లక్షలు జీతం..!!

Government Jobs : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. (HsL) సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఈ సంస్థలలో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏ విభాగాలలో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Government jobs in Visakhapatnam 2 lakh salary per month
Government jobs in Visakhapatnam 2 lakh salary per month

1).మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో మొత్తం 40 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

2). ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు కలవు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా కలవు.

3).అర్హతలు : అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాలలో డిప్లమా/గ్రాడ్యుయేషన్, బిఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా పలు విభాగాలలో టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి.

4).దరఖాస్తు విధానం : అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అప్లికేషన్ ఆఫ్ లైన్ లో పంపించాలి.

5). దరఖాస్తు హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గాంధీగ్రామ్, విశాఖపట్నం-530005 అడ్రస్ కు పంపించాలి.

అభ్యర్థులను షార్ట్ లిస్ట్ ఆధారంగా, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.52,000 నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 30 , ఏప్రిల్ 20వ తేదీ వరకు వార్డు కాపీలను పంపించడానికి చివరి తేదీ. ఒకవేళ నిర్ణయాన్ని బట్టి మరొక ఐదు రోజులు పెంచవచ్చు.. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు https://www.hslvizag.in/ ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. కేవలం ఆసక్తి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.