Gorantla Madhav : యావత్ దేశ రాజకీయాలను షేక్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను నిజం కాదని, ఫేక్ అని పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది.. పోలీసు ప్రకటనలతో ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా ముందుకు వచ్చారు.. తనపై దృష్ప్రచారం చేసిన టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. మరోవైపు ప్రైవేట్ ఫోర్స్నిక్ రిపోర్ట్ కు సంబంధించిన టిడిపికి బిగ్ షాక్ తగిలింది. తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.. ఈ అంశం పైన గోరంట్ల మాధవ తీవ్రంగా స్పందించారు..
ఒకవైపు మాధవపై చర్యలు తీసుకోవాలని గోల చేస్తూనే మరోవైపు హఠాత్తుగా టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశం పెట్టి ఓ రిపోర్టు రిలీజ్ చేశారు. అమెరికాలోని ఎక్లిప్స్ పేరుతో ఉన్న ఒక ఫోర్స్ నిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టట. మాధవ్ వీడియోను తాము అమెరికాలోని ల్యాబ్ కు పంపితే అది ఒరిజినలే అని పట్టాభి అన్నారు.. దాంతో గొడవ మరింత పెద్దదవుతుంది.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.. ఎక్లిప్స్ రిపోర్టర్ పేరుతో టిడిపి సర్కులేట్ చేస్తున్న రిపోర్టరే ఫేక్ రిపోర్టరట. ఈ విషయాన్ని ఏపీసిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో చెప్పారు. టిడిపి సర్కులేషన్ లో పెట్టిన ఎక్లిప్స్ రిపోర్టును తాము అమెరికాలోని ఓ కంపెనీకి పంపించారట.
దాని ఓనర్ జిమ్ సాఫ్ట్వేర్ తో మాట్లాడారు. అయితే తనకు వచ్చిన వీడియోలలో ఎక్కడ కట్ట్ కానీ ఎడిటింగ్ కానీ జరగలేదని మాత్రమే తాను చెప్పినట్లు చెప్పారట.. తన పేరుతో టిడిపి సర్కిల్ చేస్తున్న రిపోర్టు ఫేక్ రిపోర్టర్ అని కూడా జిమ్ తమకు ఈమెయిల్ ద్వారా చెప్పారని సునీల్ చెప్పారు. ఫేక్ రిపోర్టు సర్కులేషన్ లో పెట్టిన వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సునీల్ హెచ్చరించారు. ఫైనల్ గా టిడిపి రిలీజ్ చేసిన రిపోర్టే షేక్ రిపోర్టు అని ఇప్పుడు తెలిసిపోయింది. తప్పుడు ఆరోపణలు చేయడంలో తప్పుడు రిపోర్టును చలామణి చేయడంలో టిడిపి అందే వేసిన చేయగా వైసిపి ఎదురుదాడి స్టార్ట్ చేసింది..