Google Pixel 7 Phone : ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ తమ తదుపరితరం పిక్సెల్ మొబైల్స్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలను తాజాగా వెల్లడించింది. Google pixel 7 మరియు Pixel 7 బ్రో స్మార్ట్ ఫోన్లను అతి త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లాంచ్ తేదీని కూడా ఖరారు చేయడం గమనార్హం. ఇకపోతే ఈ రెండు పిక్సెల్ స్మార్ట్ఫోన్ మోడల్స్ ను అక్టోబర్ ఆరో తేదీన లాంచ్ చేసేందుకు నిర్ణయించినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ వెబ్సైట్లో పేర్కొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నారు.
ఇకపోతే రాబోయే కొత్త మోడల్ కు సంబంధించి కంపెనీ ముందుగా ఈ సంవత్సరం మొదట్లో గూగుల్ I/O లో ప్రకటించింది. ఇక Google Pixel Watch విషయానికి వస్తే కంపెనీ మే నెలలో దీనిని టేస్ట్ చేసింది సమాచారం. ప్రకారం. Google pixel 7, Pixel 7 pro అలాగే Pixel Watch అన్నీ కూడా అక్టోబర్ ఆరో తేదీన ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం . ఇక అదే విధంగా కొత్త నెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్ లు కూడా కంపెనీ నుంచి లాంచ్ అవుతున్నాయి. ఇకపోతే కంపెనీ తన తదుపరి మేడ్ బై గూగుల్ లాంచ్ ఈవెంట్ ను అక్టోబర్ ఆరవ తేదీన నిర్వహించబోతున్న నేపథ్యంలో మంగళవారం తన యూఎస్ వెబ్సైట్ ద్వారా ప్రకటించింది.
అక్టోబర్ 6 2022 ఉదయం 10 గంటలకు ఈటి జరిగే లైవ్ ఈవెంట్లు తదుపరి గూగుల్ పిక్సెల్ డివైస్ ల ఫోర్ట్ ఫోలియోను అధికారికంగా ప్రకటిస్తామని ల్యాండింగ్ పేజీ ద్వారా ప్రకటించింది. ఇక ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓఎస్ తో రన్ చేయబడతాయి. ఇక గూగుల్ ప్రకారం ఈ మొబైల్స్ లో వినియోగిస్తున్న కొత్త చిప్స్ యూజర్లకు భద్రతకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మోడల్ లో పలు అద్భుతమైన ఫీచర్లు కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపోతే గూగుల్ పిక్సెల్ మరెన్నో స్మార్ట్ ఫోన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.