JOB : మహిళలు ఉద్యోగం చేయాలి అంటే ఉన్నత చదువులు చదవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ పదవ తరగతి వరకు మాత్రమే చదివితే ఎక్కడైనా షాప్ లో పని చేయడానికి లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కేవలం పది వేల రూపాయల తో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఎన్నో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ నలుగురిలో పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఇకపోతే ఈ క్రమంలోనే మహిళలకు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు . ఎందుకంటే మీరు డిగ్రీ , పీజీ, బీటెక్, ఎమ్ టెక్ లాంటి ఉన్నత చదువులు చదవకపోయినా కేవలం 10 , ఇంటర్ విద్యార్హతతోనే ఇంటి నుండి ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ప్రస్తుతం మీరు ఏ కారణం చేత అయినా సరే డిగ్రీ కూడా పూర్తి చేయలేక పోయినా కేవలం 10 , 12 తరగతుల వరకు మాత్రమే చదివి మీ చదువును చాలించినా.. సొంతంగా కాళ్లపై నిలబడాలంటే కూడా ఇప్పుడు అలాంటి అవకాశం మీ ముందుకు రానే వచ్చింది.
ఎందుకంటే దేశంలో ఇలాంటి అనేక మొబైల్ యాప్ లు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఇవి ముఖ్యంగా మహిళలను ముందుకు సాగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలు ఈ యాప్ ల వాడకంలో 2021లో పురోగతికి అనేక మార్గాలను తెరిచారు .ఇక చాలా మంది వీటిని ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం.ఢిల్లీ ఎన్సీఆర్.. హైదరాబాద్, ముంబై, పూణే వంటి తదితర మెట్రో నగరాల్లోని ప్రముఖ అప్నా యాప్ మహిళలలో చైతన్యం నింపడమే కాకుండా మంచి పట్టు కూడా సాధించింది. ఇక దీని ద్వారా ఎంతో మంది మహిళలు డబ్బు సంపాదిస్తున్నారు. ఇక అంతే కాదు పోయిన సంవత్సరం ఈ ఆప్ ను ఉపయోగించిన లక్షలాది మంది మహిళలు ఇప్పటికే మంచి ఉద్యోగాలు సాధించడం గమనార్హం.. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్లాట్ ఫారం లో మహిళలు ఉద్యోగాల కోసం చాలా అధికారిక పద్ధతులను అవలంభించాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా ఇది వారి ఆలోచనలను , సంకోచాలను తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎలా పని చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
ముందుగా తమ సమాచారాన్ని ఈ ఆప్ లో నమోదు చేసిన తర్వాత మీ అవసరాన్ని బట్టి ఉద్యోగాలు పొందడానికి వారికి అనేక ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు బ్యాంక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్, టీచర్, అకౌంటెంట్ , అడ్మిన్ ఆఫీస్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , టెలీకాలర్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలు చేయడానికి పెద్దగా చదువుకోవలసిన అవసరం లేదు .. అనుభవం అంతకన్నా అవసరం లేదు . కేవలం అవగాహన ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు ఎక్కువ అర్హులు అవుతారు. ఇకపోతే మహిళలను స్వావలంబన చేయడానికి బలమైన వేదిక అలాగే ప్రత్యేక మహిళల కోసం నిర్వహిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్ షీ రోస్ కూడా మహిళలను స్వావలంబన చేయడానికి బలమైన వేదికగా అవతరించింది.
ఇకపోతే ఇక్కడ అన్ని వయస్సుల మహిళలు కూడా ఈ వెబ్సైట్ ద్వారా చేరి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చూడవచ్చు.అంతేకాదు తమ స్థాయిలో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే ఇతరులను కూడా ప్రమోట్ చేయవచ్చు. దీని సహాయంతో వ్యాపార మహిళలు తమ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు . ఈ విధంగా మొబైల్, ఇంటర్నెట్, టెక్నాలజీ మహిళలను మరింత బలోపేతం చేయడం లో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపితం అయింది. కాబట్టి వీటి ద్వారా మరింత ప్రయోజనాలను పొందాలంటే కచ్చితంగా వీటిని ఉపయోగించి తీరాల్సిందే. ఇక వీటి ద్వారా అత్యధిక లాభాలను పొందడంతోపాటు నలుగురిలో గౌరవంగా జీవించవచ్చు.