Good News : కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా రక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.. ఇక ఈ నేపథ్యంలోనే పీఎమ్ మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లో మహిళలు లబ్ధి పొందవచ్చు.. అదేమిటంటే మహిళలకు తొలి కాన్పు విషయంలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఇప్పుడు అతి త్వరలో కేంద్రం రెండో కాన్పుకు కూడా ఈ స్కీంను అమలు చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం లో రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే ఈ స్కీం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం..
ఇకపోతే ఇప్పటి వరకు భర్త ఆధార్ కార్డు వివరాలు తీసుకొని కేంద్రం ఈ పథకం ద్వారా డబ్బులు వారి ఖాతాలో జమ చేసేది. ఇకపై ఈ నిబంధన విషయంలో కేంద్రం మార్పు తీసుకురానున్నట్లు సమాచారం.. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం మహిళలకు ప్రయోజనం చేకూరేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎక్స్ పెండిచర్ ఫినాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం ఈ పథకం ద్వారా ఏడాదికి 51.7 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనాలు పొందుతున్నారు.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మహిళలకు ఈ సహాయం అందించనుంది..

మొదటి విడతగా వెయ్యి రూపాయలు, రెండో విడతగా రెండు వేల రూపాయలు మూడో విడతగా మరో రెండు వేల రూపాయలను పొందే అవకాశాన్ని కల్పించింది . అలా మొత్తం గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఖాతాలో ఈ డబ్బులు 5000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది.. మహిళలు ఒకవేళ మీరు కూడా గర్భం దాల్చినట్లు అయితే మీకు దగ్గరలో ఉన్న ఆశావర్కర్లను సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఈ స్కీం పొందడానికి అనర్హులు.. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మాత్రమే ఇలాంటి పథకాలను అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.