ఈ మధ్యకాలంలో టెలికాం సంస్థల మధ్య పోటీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్ని టెలికాం సంస్థలు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి చాలా వరకు తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ తో ఎక్కువ బెనిఫిట్స్ ను అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా కూడా తమ నెట్వర్క్ ను విస్తృతం చేసుకోవడానికి తాజాగా 150 జిబి డేటా బోనస్ ఆఫర్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రకటించింది.
వోడాఫోన్ ఐడియా రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్..
ఈ ప్లాన్ ను ఆన్లైన్ యాప్స్ ద్వారా కొనుగోలు చేస్తే 40GB డేటాతో పాటు 150GB డేటాను బోనస్ కింద పొందుతారు. ఇక రెండింటితో కలిపి నెలలో మొత్తం 190GB డేటాను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు వినియోగదారులు 200GB డేటా రోల్ ఓవర్ ఫీచర్, అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు నెలకు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు వి ఐ మూవీస్ , వి ఐ టివి సబ్స్క్రిప్షన్ ని కూడా పొందవచ్చు. అంతేకాదు వి ఐ యాప్ లో ఆరు నెలల పాటు యాడ్ ఫ్రీ హంగామా మ్యూజిక్ ను మీరు ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు Zee 5 ప్రీమియం కూడా ఉచితంగా లభిస్తుంది.
రూ.300 లోపు వోడాఫోన్ ఐడియా అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే..
రూ.299 ప్లాన్ ద్వారా మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను కస్టమర్లకు కంపెనీ ఆఫర్ చేస్తోంది అంతేకాకుండా ప్రతిరోజు 1.5జిబి డేటా చొప్పున డేటాను పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ మీకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది అంతేకాదు కస్టమర్లు 12:00 AM నుంచి 6:00 AM వరకు అపరిమిత ఉచిత బ్యాండ్ విడ్త్ ను పొందుతారు.
రూ.249 ప్లాన్ విషానికి వస్తే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది .. 1.5 GB డేటాను ప్రతి రోజు పొందుతారు.. 21 రోజుల ప్లాన్ వాలిడిటీ మీకు లభిస్తుంది. అంతేకాదు విఐ యాప్ లకు సంబంధించి మీరు ఉచిత సంస్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక వోడాఫోన్ ఐడియా అందిస్తున్న డేటా ప్లాన్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు ఇక ఈ ప్లాన్ తో వోడాఫోన్ ఐడియా కంపెనీకి కస్టమర్లు సరిగా అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.