Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలు..!!

Jobs : తెలంగాణలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న DCCB బ్యాంకులో 445 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వివిధ పోస్టుల కోసం రిక్రూమెంట్ నిర్వహించింది.. ఈ పోస్టులను తెలంగాణ లోకల్ అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్..HTTPS://tscab.org/ చూడవలెను.

Advertisement
Good news for unemployed  Jos in Bank 
Good news for unemployed  Jos in Bank

1).జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులు : అదిలాబాద్-69, కరీంనగర్-84, నల్గొండ-36, ఖమ్మం-50, వరంగల్-50, మహబూబ్ నగర్-32, హైదరాబాద్-52 మెదక్-72 పోస్టులు ఖాళీలు కలవు..

Advertisement

2).విద్యార్హతలు : స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.. అంతేకాకుండా తెలుగు స్పష్టంగా మాట్లాడటం రావాలి. ఇంగ్లీష్ కూడా తప్పనిసరిగా రావాలి.. ముఖ్యంగా కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.

3). అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు : ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.. ఇందుకు కూడా తెలుగు భాష వచ్చుండాలి. మరియు ఆంగ్లము కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం తెలిసి ఉండాలి.

4). వయసు : ఈ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

ఈ పోస్టులను ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

5).దరఖాస్తు ఫీజు : Sc, St,PWC లకు రూ.250 రూపాయలుగా BC/GENERAL అభ్యర్థులకు 900 రూపాయల ఫీజు గా నిర్ణయించబడింది.

జీతభత్యాలు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.26,080 నుండి 57,860 రూపాయల వరకు చెల్లిస్తారు.
స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు.. నెలకు 17,900 నుండి..47,920 రూపాయల వరకు జీతం చెల్లిస్తున్నారు.
అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించాలి..HTTPS://tscab.org/ అభ్యర్థులు ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే అప్లై చేసుకోవాలి.

Advertisement