SmartPhone : స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. రూ.15 వేల లోపే.. బెస్ట్ ఫీచర్లతో..!!

SmartPhone : ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ప్రతి పిల్లవాడి చేతిలో కూడా మనం ఎక్కువగా స్మార్ట్ఫోన్ అనేది చూస్తూ ఉంటాము. ఇక ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారిపోయిన ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు కూడా స్కూల్స్ కి వెళ్లలేక ఆన్లైన్ క్లాసులు అంటూ లాప్టాప్ , సెల్ ఫోన్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు స్కూల్ నుంచి తిరిగి రాగానే ఇంటికి వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక కేవలం పిల్లలు మాత్రమే కాదు యువత , పెద్దలు కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ కు బాగా అలవాటు పడిపోయారు.

అందుకే స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు బడ్జెట్ తో పాటు ఇతర ఫీచర్లను కూడా తప్పకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫీచర్లు ఎక్కువగా ఉండే స్మార్ట్ ఫోన్లు అయితే మనకు ధర ఎక్కువ పలుకుతూ ఉంటాయి. కానీ మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్లు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. కేవలం రూ.15 వేల లోపే అద్భుతమైన ఫీచర్లతో కూడిన కొన్ని రకాల ఫోన్ మోడల్స్ మీకోసం లిస్టు చేయబడ్డాయి వాటి గురించి ఒకసారి చదివి తెలుసుకోండి. ఒప్పో K10 స్మార్ట్ ఫోన్ : 6.59 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో ఒప్పో క్వాలిటీ స్నాప్ డ్రాగన్ 680చిప్ సెట్ అలాగే 6GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది.

Good news for those who want to buy a smart phone Rs.15 thousand
Good news for those who want to buy a smart phone Rs.15 thousand

ఇక 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సార్ తో పాటు 2 ఎంపీ మైక్రో కెమెరాను అందజేస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది. 33 W సూపర్ VOOC చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందిస్తోంది ముఖ్యంగా ఈ స్మార్ట్ మొబైల్ ధర రూ.14,990 మాత్రమే.ఇన్ఫినిక్స్ నోట్ 12 5G : 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఏ వన్ లెన్స్ తో పాటు 50 mp ప్రైమరీ కెమెరా , 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటు సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరాను అందించారు. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5500 mah బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక దీని విలువ రూ.14,999 ఇక వీటితోపాటు రెడ్ మీ నోట్ 11 ధర. రూ.13,999 కాగా మోటోరోలా జి31 రూ.13,999.