Laptop : ప్రముఖ బ్రాండెడ్ అయిన షియోమి బ్రాండెడ్ నుంచి ఇప్పటివరకు పలు మొబైల్స్, ల్యాప్ టాప్ , పవర్ బ్యాంక్స్, స్మార్ట్ టీవీలు వంటివి కూడా అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. అయితే MI ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సేల్ లో రెడ్మి బుక్-15 ప్రో ల్యాప్ టాప్ ధర రూ.59,999 రూపాయలు ఉన్నది. అయితే దీనిని ఆఫర్ కింద రూ.35,999 రూపాయలకే కస్టమర్లకు తీసుకునే విధంగా ఆఫర్ ని ప్రకటించింది. ఇక అంతే కాకుండా ఇందులో ICICI,KOTAK,BOB బ్యాంకు కార్డు ద్వారా రూ.4000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఈ ల్యాప్ టాప్ యొక్క పూర్తి వివరాలను స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
REDMI BOOK -15 PRO డిస్ప్లే విషయానికి వస్తే 15.6 అంగుళాలు కలదు. ప్యానెల్ కూడా LCD డిస్ప్లే తో కలదు. స్క్రీన్ రెజల్యూషన్ 1920X1080 గా ఉండనుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ ఐరిక్స్ ఎక్స్ అందిస్తున్నది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే..ల్యాప్ టాప్ 512 GB SSD కార్డు సపోర్ట్ తో లభిస్తుంది. 8 GB DDR 3200 RAM తో లభిస్తుంది మరియు ల్యాప్ టాప్ 11 జనరేషన్ తో పాటు ఇంటెల్ కోర్ i-5 కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే .. ఇందులో చాలా శక్తివంతమైన బ్యాటరీ కలదు. దాదాపుగా 10 గంటలపాటు బ్యాటరీ బ్యాక్అప్ వచ్చే విధంగా ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈ ల్యాప్ టాప్ కు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించారు.
ల్యాప్ టాప్ ఆపరేటింగ్ విషయానికి వస్తే..విండోస్ -10 home తో ఈ ల్యాప్ టాప్ నడుస్తుంది.. మరియు ఇందులో ఎమ్మెస్ ఆఫీస్, స్టూడెంట్ ఎడిషన్ తదితర ఆప్షన్ లు కూడా కలవు. ఇక సౌండ్ కోసం ఈ ల్యాప్ టాప్ 2 వాట్ స్టీరియో అవుట్ ఫుట్ స్పీకర్లను కూడా అందిస్తోంది. ఇక ఇందులో DTS ఆడియో టెక్నాలజీ తో సపోర్ట్ చేసే వాటిని కూడా ప్రవేశపెట్టింది. ఇక కనెక్టివిటీలో వంటి వాటి కోసం..ల్యాప్ టాప్ లో డ్యూయల్ వైఫై, బ్లూటూత్ -5.0 , రెండు యుఎస్బి పోర్టులు..HDMI స్లాట్, ఈథర్నెట్ ఫోర్ట్ SD కార్డు రీడర్ మరియు 3.5 MM హెడ్ ఫోన్ జాక్ కూడా లభిస్తుంది. అయితే ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.