Army Job Notification : ఆర్మీ జాబ్ కోసం చూస్తున్న వాళ్లకి గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి..!

Army Job Notification : ఆర్మీలో చేరాలనుకునే యువత కోసం అగ్నివీర్ ఎంపికలు ఈనెల 29వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ ( AOC ) కేంద్రంలోని ABC ట్రాక్లో నిర్వహిస్తున్నట్లు ఏవోసి కేంద్రం తెలిపింది. ఇక హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్ని వీర్ జనరల్ డ్యూటీ (GD), ట్రేడ్స్ మెన్, టెక్ (AE) , క్రీడాకారుల విభాగాల్లో ఆసక్తి కలిగిన యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పదిహేడున్నర సంవత్సరాల వయసు నుంచి 23 సంవత్సరాలు వయసులోపు ఉన్నవారు ఇందుకు అర్హులు. ఇక అగ్ని వీర్ జీడి, ట్రేడ్స్ మెన్ కు 10వ తరగతి ఉత్తీర్ణత కాగా.. టెక్ (ఏ ఈ) కి సైన్స్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

Good news for those who are looking for army job.. Apply immediately
Good news for those who are looking for army job.. Apply immediately

ఓపెన్ క్యాటగిరీ లో ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఈనెల 26 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ ఏఓసి కేంద్రంలోని థాపర్ స్టేడియంలో హాజరు కావాలని సైనికాధికారులు తెలిపారు. బాక్సింగ్ , బాస్కెట్ బా, హాకీ, హ్యాండ్ బాల్, ఈత, అథ్లెటిక్స్ , క్రికెట్, కబడ్డీ వంటి క్రీడల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో రాష్ట్ర జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఏఓసి కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం joinIndianarmy.nic.in అనే వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఒకవేళ సికింద్రాబాద్ పరిధిలో ఉన్న వ్యక్తులు నేరుగా సికింద్రాబాద్ లో ఉన్న ఏవోసీ సెంటర్కు వెళ్లి సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ అగ్ని వీర్ కింద నాలుగు సంవత్సరాల పాటు వృత్తి పరిమితిని కల్పిస్తారు. ఒకవేళ ఆ తర్వాత కూడా తమ పెర్ఫార్మెన్స్ లో అభివృద్ధి కనబరిస్తే వారిని కొనసాగిస్తారు. లేకపోతే రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో చేరడానికి యువత కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మీలో కూడా ఆసక్తి ఉండి అర్హత ఉంటే వెంటనే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు ఎలా అప్లై చేయాలి అంటే.. joinIndianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేరుగా సికింద్రాబాద్ AOC కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.