ITI : ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ టెక్నాలజీ వైపే తమ చదువులను కొనసాగిస్తూ ఉన్నారు అలా ఐటిఐ చదివిన వారు ఎంతో మంది నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు తాజాగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్..(BHEL) లో తాత్కాలికంగా వెల్డర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ సంస్థ. నోటిఫికేషన్లో తెలిపిన ప్రకారం.. ఒక ఏడాది పాటు IBR సర్టిఫికేషన్ కోర్సును కూడా అందించబడుతుందట. ఇందులో 75 పోస్టుల వరకు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు..https:// www.bhel.com/అనే వెబ్సైట్లో చూడవచ్చు.
ఖాళీల వివరాలు సంఖ్య..75
1).జీతభత్యాలు : ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రతి నెల 37,500 రూపాయలు పే స్కేల్ చెల్లి ఇస్తారట.
2). అర్హతలు : గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీ నుంచి అయినా అభ్యర్థులు ITI, తత్సమాన అర్హత సాధించి ఉండాలి. అలాగే కనీసం ఏదైనా రెండు సంవత్సరాలుగా వెల్డింగ్ అనుభవం ఖచ్చితంగా ఉండాలట.
3). వయస్సు : ఆసక్తికరమైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.. అలాగే..SC/ST/OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉన్నది.
4). ఎంపిక విధానం : అభ్యర్థుల షార్ట్ లిస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయబడుతుంది.
5). దరఖాస్తు విధానం : ఆసక్తికరమైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవలెను. ఈ పోస్టులను అప్లై చేసుకునేందుకు ఈ నెల 14వ తేదీ చివరి తేదీ గా ప్రకటించడం జరిగింది.
6). దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ అభ్యర్థులు..200 రూపాయలు. Sc/st అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం..https:// www.bhel.com/ లో చూడండి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో చూసి అప్లై చేసుకోవడం మంచిది. ఈ పోస్టులకు కేవలం ఐటిఐ చదివిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను.