Bank Jobs : ఇటీవల కాలంలో నిరుద్యోగులకు వరుస ఉద్యోగ అవకాశాలు వెలువడుతూనే ఉన్నాయి.. ఇక ఇదే తరుణంలో బ్యాంకు ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఇందులో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు గా ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12న నిర్ణయించడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు , ఆసక్తికరమైన అభ్యర్థులు ఈ తేదీ లోపల అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది.ఇక ఖాళీల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

ఖాళీలు విద్యార్హతలు:
1). జనరల్ లిస్ట్ ఆఫీసర్ స్కేల్-2 : మొత్తం ఇందులో 400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.. అంతే కాకుండా కనీసం మూడు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి.
ఇక వయసు 25 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
2). జనరల్ లిస్ట్ ఆఫీసర్ స్కేల్-3 : ఇందులో 100 ఖాళీలు ఉన్నాయట. అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.. అంతేకాకుండా 5 సంవత్సరాలు కనీసం అనుభవంగా ఉండాలట.
అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలంటే:
1).ముందుగా అభ్యర్థులు..http://www.bankofmaharashtra.co.in/ అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి.
2). అనంతరం కెరియర్ అనే ఆప్షన్ ని కూడా ఎంచుకోవాలి.
3).ఆ తరువాత అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
4). ఇక ఆ తర్వాత కరెంటు ఓపెనింగ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
5). అటుపిమ్మట జనరల్ లిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కింద ఆన్లైన్ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
ఇక ఆ తర్వాత అప్లికేషన్ సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి submit button పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సంప్రదించండి.