తన యూజర్ల కోసం ఫోన్ పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు తాజాగా ప్రకటించింది. దీని ద్వారా రూ.200ల లోపు ఏవైనా పేమెంట్లు చేసే సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో చాలా త్వరగా చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. యూపీఐ లైట్ ద్వారా చేసే చిన్నపాటి చెల్లింపులు బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించవు. దీనిని వాడేందుకు కొన్ని దశలను పాటించాలి. తొలుత ఫోన్ పే యాప్ ఓపెన్ చేయాలి. హోమ్ స్క్రీన్‌పై యూపీఐ లైట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
టర్మ్స్ అన్నీ అంగీకరించాలి. తర్వాత మీ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లైట్‌కి రూ.2 వేల లోపు జమ చేసుకోవచ్చు. అనంతరం దానిని చిన్నపాటి చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. అన్ని ప్రధాన బ్యాంకులు ఫోన్‌పేలో యూపీఐ లైట్‌కి సపోర్ట్ చేస్తాయి. కిరాణా సామాగ్రి కొనుగోలు, ఇతర చిన్న చిన్న చెల్లింపులకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.