Pension : పెన్షన్ పొందే వారికి గుడ్ న్యూస్..!!

Pension : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ పెన్షనర్ ల కోసం భారీ ఊరట కలిగించింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 95 కింద పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ను ఏడాదిలో ఎప్పుడైనా సరే సబ్మిట్ చేయవచ్చు అని తెలిపింది.. లైఫ్ సర్టిఫికెట్ ను పెన్షనర్లు కేవలం నవంబర్ నెలలో మాత్రమే సమర్పిస్తారు.. సబ్మిట్ చేసిన తేదీ నుంచి వచ్చే సంవత్సరం అదే తేదీ వరకు ఈ లైఫ్ సర్టిఫికెట్ వ్యాలిడిటీలో ఉంటుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇకపోతే ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది..

ఇక ఎందుకు లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి అనే విషయానికి వస్తే.. సదరు పెన్షనర్ జీవించి ఉన్నాడో లేదో అని తెలియడానికి.. చాలా మంది మరణించిన తర్వాత కూడా పెన్షనర్ పేరుమీద పెన్షన్ తీసుకుంటున్నారు.. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవలసిందిగా ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇకపోతే పెన్షనర్లు సబ్మిట్ చేసే లైఫ్ సర్టిఫికెట్ కు సంబంధించి నిబంధనలను డిసెంబర్ 2019 లో నే మార్చడం జరిగింది. ఇక ఎవరైనా సరే పెన్షనర్లు ప్రతి నెల రెగ్యులర్ గా పెన్షన్ పొందాలి

Good news for pensioners
Good news for pensioners

అంటే కచ్చితంగా ఈ లైఫ్ సర్టిఫికెట్ ను నవంబర్ నెలలో సమర్పించాల్సి ఉంటుంది అని గతంలో చెప్పడం జరిగింది..కానీ ఇప్పుడు ఆ నిబంధనలను మారుస్తూ.. ఎప్పుడైనా సరే మీ లైఫ్ సర్టిఫికెట్ వాలిడిటీ పీరియడ్ అయిపోతున్నట్లు అయితే ఏ సమయంలోనైనా సరే లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు అని.. సబ్మిట్ చేసిన సమయం నుంచి ఏడాది వరకు వ్యాలిడిటీ లో ఉంటుంది అని.. ఇక ప్రతి ఏడాది నవంబర్లో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్ తేదీలను పూర్తిగా మార్చివేశారు అని ఎప్పుడైనా సరే మీరు లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు అని స్పష్టం చేసింది ఈపీఎఫ్ఓ.