Good News : జియో కస్టమర్లకు శుభవార్త.. 5G లాంఛ్ తేదీ అలాగే ప్లాన్ రేట్లు ఇవే..!!

Good News : రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించి.. కస్టమర్లను ఆకర్షించడంలో, వారికి అనువుగా ఉండే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోని దేశంలో 5G నెట్వర్క్ ను ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేసింది. ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటివారం కల్లా భారతదేశంలో 5G సర్వీస్ లను ప్రారంభించనున్నట్లు తెలిపినా.. ట్రయల్ సర్వీస్ కోసం ముందుగా పెద్ద నగరాలలో ప్రారంభించబడుతుంది అని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వెల్లడించింది. ఈ క్రమం లోనే ప్రస్తుతం 9 ప్రధాన నగరాలలో 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ముందుగా తొమ్మిది ప్రధాన నగరాలలో 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది రిలయన్స్ జియో.. ఈ నేపథ్యం లోనే ఢిల్లీ, కోల్ క, ముంబై , బెంగళూరు, చెన్నై , లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్ , జామ్ నగర్ వంటి మహానగరాలలో ముందుగా 5G నెట్వర్క్ అమల్లోకి వస్తుంది. ఇక ఇదే కాకుండా గురుగ్రామ్, నోయిడా మొదలైన వాటితో క్రమ క్రమంగా మరో 1000 ప్రధాన నగరాలలో కూడా 5G నెట్వర్క్ ను లాంచ్ చేసే ప్రయత్నం చేస్తుంది రిలయన్స్ జియో.. ఇక ఈ క్రమంలోనే 5G రీఛార్జి ప్లాన్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అని కస్టమర్లు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే ధరలను మాత్రం ఇంకా రిలయన్స్ జియో స్పష్టం చేయలేదు.. కానీ ఇంచుమించు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

Good news for Jio customers 5G launch date as well as plan rates
Good news for Jio customers 5G launch date as well as plan rates

ఇకపోతే రిలయన్స్ జియో యొక్క 5G ప్లాన్‌ల ధర ఎంత అనేది ఇంకా తెలియదు కాబట్టి ధరలు పెరిగినప్పటికీ, Jio 4G ప్రీమియం ప్లాన్స్ ధరలను కూడా ఇప్పటికీ రూ.400 నుంచి రూ.500 లోపే ఉంచింది. కాబట్టి, 5G సర్వీస్ యొక్క ఆకర్షణీయమైన ప్లాన్ ధర రూ. 500 కంటే ఎక్కువగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.ఇక 5G ఇంటర్నెట్ యొక్క ఉపయోగం విషయానికి వస్తే 4G కంటే 10X రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది అని ఇకపై వర్క్ ఫ్రం హోం పేరిట పనిచేసే వాళ్లకు నిరంతరాయంగా 5G సేవలను ఉపయోగించుకోవచ్చని రిలయన్స్ స్పష్టం చేసింది. ఇక నెట్వర్కింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం దిగ్గజ సంస్థలైన రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. మరి ఇందులో ఏ టెలికాం సంస్థ ముందుగా వస్తుందో తెలియాల్సి ఉంది.