Good News : అసంఘటిత రంగంలో అల్పాదాయ ప్రజలకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించడానికి సులభతరం చేయడానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మందం యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.. అయితే ఇది కాంట్రిబ్యూటరీ స్వచ్ఛంద పెన్షన్ పథకం అని చెప్పవచ్చు.. ఈ పథకంలో ఇప్పటికే 45 లక్షల మందికి పైగా చేరి లబ్ది పొందుతున్నారు.. భారత పౌరులకు మాత్రమే ఈ పథకంలో చేరి అర్హత ఉంటుంది కాబట్టి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భారత పౌరుడై ఉండాలి.. అలాంటి వాళ్లు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు..
ఇకపోతే ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జన్ ధన్ ఖాతా కలిగిన వారు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఈ పథకం కింద సుమారుగా 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3000 అంటే సంవత్సరానికి రూ.36,000 పెన్షన్ లభిస్తుంది. EPFO, NPS లేదా ESICలో సభ్యులుగా ఉన్న వారు ఈ పథకం ప్రయోజనాన్ని మాత్రం పొందలేరు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.

ఇకపోతే ఈ పథకం లో చేరేవారు.. PM శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కోసం కేవలం రెండు పత్రాలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది.. ఆధార్ కార్డ్, సేవింగ్స్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా (IFSC కోడ్‌తో) అవసరం అవుతుంది.. మీకు జన్ ధన్ ఖాతా ఉంటే ఈ పథకంలో చేరవచ్చు. దీని కోసం మీరు ప్రత్యేక పొదుపు ఖాతాను తెరవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఆధార్ కు అనుసంధానమైన మీ మొబైల్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. కార్మికులు ఎవరైనా సరే నెలకు రూ.15,000 మించని కార్మికులు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు.