iPhone 11 : ఐఫోన్ అనేది సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉండిపోయింది.. కారణం వీటి ధరలనే చెప్పాలి.. ఆకాశానంటుతున్న వీటి ధరలు సామాన్య ప్రజలకు చాలా భారంగా అనిపిస్తున్నాయి.. నిజానికి ఎంతోమందికి ఐఫోన్ ఉపయోగించాలనే కల, కోరిక రెండూ ఉన్నప్పటికీ వాటి ధరలు చూసి తమ కోరికను అణిచివేసుకుంటున్నారు. ఇక అలా ఎక్కువ బడ్జెట్ పెట్టలేక సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతోని కాలం వెళ్లదీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికీ ఐఫోన్ కొనాలని ఆలోచించే వారికి తక్కువ ధరకే ఐఫోన్ లభిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే 50వేల రూపాయల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ. 24 వేలకే లభిస్తుందడంతో కష్టమర్లు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే 64 జిబి స్టోరేజ్ వేరియంట్ కలిగిన యాపిల్ ఐఫోన్ 11.. మార్కెట్లో అసలు ధర.. రూ.49,900.. ఇక దీనిని ఈ కామర్స్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే రూ.41,999.. ఇక సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు పై 10% ఆఫర్ కూడా లభిస్తుంది.. ఇక యాక్సిస్ బ్యాంక్ కార్డు పై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ముఖ్యంగా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా యాపిల్ ఐఫోన్ లెవెన్ పై రూ.17,000 వరకు తగ్గింపు పొందవచ్చు .ఇక ఫోన్ కండిషన్లో ఉంటే కొత్తగా ఉంటే ఆఫర్ వర్తిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక ఇన్ని ఆఫర్లు పొందిన తర్వాత మీరు ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ప్రతి నెల రూ.1436 చెల్లించి ఐఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. 64 GB ర్యామ్.. 6.1 ఇంచ్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 12 ఎంపీ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీ, వీడియోల కోసం 12 మెగాపిక్సల్ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఇక A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధర కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్ కి ఇది చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. తక్కువ ధరతో 50 వేల రూపాయల ఐఫోన్ సొంతం చేసుకునే అవకాశం కల్పించబడింది.