iPhone lovers : ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు విపరీతమైన క్రేజ్ ఉంది . ముఖ్యంగా ఐఫోన్ నుంచి ఏదైనా కొత్త మోడల్ వచ్చింది అంటే చాలు దానిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి కొత్త మోడల్ వచ్చే ప్రతిసారి పాత మోడల్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో కొత్త ఐఫోన్ విడుదలకు అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో పాత ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు ఇవ్వనున్నారు. ఇకపోతే ఆగస్టు 2022లో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కొద్ది రోజు ఆగాలని మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కేవలం కొన్ని వారాలలోపే సరికొత్త ఐఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇప్పటికే మీరు మీ పాత ఐఫోన్లను ఉపయోగించి పాతపడిపోయి ఉంటుంది. వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని మరీ తక్కువ ధరకు కూడా సొంతం చేసుకోవచ్చు.సెప్టెంబర్ లో యాపిల్ ఐఫోన్ 14 విడుదల చేయడానికి యాపిల్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే మార్కెట్లో నిన్నటి వరకు ట్రెండీగా ఉన్న ఐఫోన్ 13, ఐఫోన్ 12 , ఐ ఫోన్ 11 మోడల్ పై ధర తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి ఒక కొత్త ఫోన్ అంటే చాలామంది చాలా మోజు పడతారు. అయితే ధర ఎక్కువ ఉండడం వల్ల పాత మోడల్ కొనేందుకే చాలామంది ఇష్టపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 13 నిస్సందేహంగా గొప్ప స్మార్ట్ ఫోన్ .. అయితే కొన్ని వారాలలోనే ఇది చాలా తక్కువ ధరకే లభించబోతోంది. ప్రస్తుతం ఐఫోన్ 13 కోసం అదనంగా చెల్లించడం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు.
అందుకే మరొక రెండు వారాలు మీరు ఆగినట్లయితే ఐఫోన్ 13 తక్కువ ధరకే సొంతం చేసుకుని అవకాశం ఉంటుంది. ఐఫోన్ 14 మోడల్ వస్తున్న నేపథ్యంలో ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధరలు ఘననీయంగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ఐఫోన్ 13, ఐ ఫోన్ 12 సుమారుగా 50వేల రూపాయల వరకు ధర పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడు కొనుగోలు చేయాలని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే ఐఫోన్ కొనాలనుకునే ఎంతోమందికి ధర తగ్గించి తక్కువ ధరకే ఐఫోన్ 13 మోడల్ ను ఇవ్వడానికి ఆపిల్ సంస్థ నిర్ణయించుకుంది. కాబట్టి మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయదలుచుకుంటే కొద్ది రోజులు ఆగితే సరిపోతుంది అని మార్కెట్ ని పనులు కూడా సలహా ఇస్తున్నారు.