ఐఫోన్ లవర్స్ కి శుభవార్త.. ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్..!

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. ఇక యాపిల్ సంస్థ తన ఐఫోన్లలో ప్రవేశపెట్టే ఏ ఫీచర్ అయినా సరే అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉండడం గమనార్హం. అందుకే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ ను ఉపయోగించాలని తెగ ఆత్రుత వ్యక్తం చేస్తుంటారు. కానీ ఐఫోన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్యుడు ఐఫోన్ ని కొనుగోలు చేసి ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది . అందుకే ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ కి ఒక శుభవార్త తీసుకొచ్చింది యాపిల్. ప్రస్తుతం సెప్టెంబర్ మొదటి వారంలో యాపిల్ సంస్థ ఐ ఫోన్ 14 సిరీస్ ను తీసుకొస్తున్న నేపథ్యంలో ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ ధరలు ప్రకటించింది.This time, made-in-India iPhone 14 will compete with made-in-China | Mintప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 13.. 128 జీబీ మోడల్ పై ఊహించని రీతిలో ఏకంగా రూ. 14,000 డిస్కౌంట్ ప్రస్తుతం అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ఐఫోన్ లవర్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు ఈ ఐ ఫోన్ పై ఇలా అంటే అద్భుతమైన ఆఫర్ ప్రకటించలేదు. అంతేకాదు అదనంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ కూడా వర్తిస్తుండడంతో ఐఫోన్ 13 మీరు మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఐఫోన్ ను రూ. 14, 000 తగ్గింపుతో కేవలం రూ.65,999 కే సొంతం చేసుకోవచ్చు.Zero-click iMessage zero-day used to hack the iPhones of 36 journalists | Ars Technica

Advertisement

ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్ కనుక పొందితే ఈ ఐఫోన్ పై అదనంగా మరొక వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.64,999 కే సొంతం చేసుకోవచ్చు ఇక మొత్తంగా చూసుకుంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా 15, 000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అంతేకాదండోయ్ మరొక ఆఫర్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం.. మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 13 ని కొనుగోలు చేయాలని అనుకుంటే ఏకంగా మీకు రూ.19,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ముందుగా మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మోడల్ , కండిషన్ బట్టి ఆఫర్ కూడా మారుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఆఫర్ బ్యాంక్ ఆఫర్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ మూడూ వర్తిస్తే.. ఐఫోన్ 13 ను కేవలం రూ.45,999 కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement