iPhone 14 : ఐ ఫోన్ లవర్స్ కు శుభవార్త.. ఐ ఫోన్ 14 పై కూడా డిస్కౌంట్ మొదలు..!

iPhone 14 : ఈ మధ్యకాలంలో యాపిల్ కంపెనీ తమ కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పాత స్మార్ట్ ఫోన్లపై ధరలు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసిన ఐఫోన్ 14 సీరీస్ నుంచి 4 మోడల్స్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. నిజానికి ఐఫోన్ 14 విడుదల చేసేటప్పుడు ఐఫోన్ 13, ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్లపై భారీ స్థాయిలో తగ్గింపు ధరలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అందుకే ఐఫోన్ కొనాలనుకునేవారు ఐఫోన్ 14 కాకుండా ఐఫోన్ 13, ఐఫోన్ 12 సీరీస్ లను కొనుగోలు చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ లో జరుగుతున్న విషయం తెలిసింది. ఇక ఈ రెండు ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా ఇప్పుడు ఐఫోన్ 14 పై కూడా భారీ తగ్గింపు ధరలు అందించడానికి సిద్ధమైంది యాపిల్. ఇక ఐఫోన్ 14 కోసం కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నట్లయితే మీకు చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. భారతదేశంలో యాపిల్ తమ కొత్త ఐఫోన్ 14 సిరీస్ ను ప్రారంభించినప్పుడు దాని ప్రారంభ ధర రూ.79,900 గా నిర్ణయించింది. ఇక కొన్ని అర్హతలను మీరు పొందినట్లయితే దానిని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా కలుపుకొని ఐఫోన్ 14 ఫోన్ ను ఇండియా ఐ స్టోర్ లో కేవలం రూ.53,900 కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Good news for iPhone lovers, discount
Good news for iPhone lovers, discount

అయితే ఇది ఫ్లాట్ డిస్కౌంట్ కాదు ఇందులో అనేక బ్యాంకు మరియు ఎక్స్చేంజ్ డీల్స్ కూడా ఉన్నాయని విషయాన్ని గుర్తించాలి. ఇకపోతే ఎలాంటి డీల్స్ వర్తిస్తాయి అనే విషయానికి వస్తే ఐఫోన్ 14 ఇండియా ఐ స్టోర్ లో రూ.79,900 ప్రారంభ ధర ఉండగా.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 క్యాష్ బ్యాక్ ప్రమోషన్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా రూ. 3,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహం కూడా మీకు కలిగిస్తుంది. రూ.8,000 డిస్కౌంట్తో రూ.71,900 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకునేవారు ఐఫోన్ 11 యూజర్లకు ఇప్పుడు ఎక్స్చేంజ్ పై ప్రభావంతమైన ధర కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 14 కొనుగోలు చేస్తే దానిపై రూ. 18, 000 తగ్గింపు ధర పొందవచ్చు. మొత్తంగా ఈ ఐ ఫోన్ 14 ను కేవలం రూ.53,900 కే సొంతం చేసుకోవచ్చు.