అత్యాధునిక ఫీచర్లతో కూడుకున్న ఆపిల్ ఐఫోన్ ను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కానీ బడ్జెట్ కారణంగా వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఐఫోన్ ప్రియుల కోసం తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ మరింతగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది ఆపిల్ సంస్థ . చాలా రోజుల తర్వాత భారీ డిస్కౌంట్తో తక్కువ ధరకే ఐ ఫోన్ లను అందించడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12ను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ద్వారా తక్కువ ధరకే అందించడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే ఆగస్టు 6 వ తేదీ నుంచి అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐఫోన్ 12 తో సహా అనేక ఐఫోన్ లపై డిస్కౌంట్ లను ప్రకటించింది.
ఇక వీటి గురించి మనం ఒకసారి చదువు తెలుసుకుందాం.ముఖ్యంగా అమెజాన్ అందిస్తున్న గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.58,900 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఇక ఐఫోన్ 64 జిబి స్టోరేజ్ మోడల్ డివైస్ పై అధికారికంగా 2021 డిసెంబర్లో భారీ తగ్గింపుతో వచ్చింది. అప్పుడు ఐఫోన్ 12 రూ.65,990 కి అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు యూజర్లు ఏకంగా రూ.7,090 డిస్కౌంట్ ను పొందవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 12 పాత స్మార్ట్ఫోన్ అయినప్పటికీ పర్ఫామెన్స్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని పొందవచ్చు. కానీ మీరు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే మీరు ఐఫోన్ 13 కొనుగోలు చేయడమే బెటర్. ముఖ్యంగా ఐఫోన్ 13 అమెజాన్ లో ప్రారంభ ధర రూ.68,990 గా ఉండనుండగా ఈ డివైస్ అసలు రిటైల్ ధర మార్కెట్లో రూ.79,900 గా ఉంటుంది.
కానీ ఈ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో యూజర్లు రూ. 11,000 డిస్కౌంట్ పొందవచ్చు.అంతేకాదు పాత ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.13,150 అదనంగా డిస్కౌంట్ ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా రెండు ఐఫోన్లలో ఇదే డిస్కౌంట్ ఆఫర్ అందులో అందుబాటులో ఉండడం గమనార్హం. ఇకపోతే మీరు ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఐఫోన్ 12 , 13 కూడా అమెజాన్ లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు మీ బడ్జెట్ను బట్టి డివైస్ ని కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే వచ్చే నెల సెప్టెంబర్ లో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సీరీస్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మీరు కొత్త ఐఫోన్ ను కొనాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ నెల వరకు వేచి చూడక తప్పదు . ఇక దీని ధర సుమారుగా రూ.80వేల వరకు ఉంటుందని అంచనా.