DRDO-RCI : డీఆర్డీవో, ఆర్సీఐ అభ్యర్థులకు శుభవార్త..!!

ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ని ఉపాధి ఎప్పుడు కల్పిస్తుందని ప్రభుత్వం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది యువత. ఈ క్రమంలోనే ముందు నుంచి కోచింగ్ తీసుకుంటూ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న డీఆర్డీఓ , ఆర్సీఐ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పవచ్చు. వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను హైదరాబాదులోని డీఆర్డీఓ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభ్యర్థులను కోరుతోంది. ఖాళీల వివరాలు గురించి మనం తెలుసుకుందాం..

మొత్తం ఖాళీల సంఖ్య..150..అందులో ఖాళీల వివరాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 40
డిప్లమా టెక్నీషియన్ అప్రెంటిస్ – 60
ట్రేడ్ అప్రెంటీస్ – 50

Good news for DRDO and RCI candidates 
Good news for DRDO and RCI candidates

1.గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగాల విషయానికి వస్తే.. ఈసీఈ, ఈ ఈ ఈ, సీ ఎస్ ఈ, కెమికల్ ,మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.అర్హత విషయానికి వస్తే.. సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, బికాం, బిఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాదు 2019, 2020, 2021 గ్రాడ్యుయేటర్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించబడింది.

స్టైఫండ్: తొమ్మిది వేల రూపాయలను నెలకు చెల్లిస్తారు.2.టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ విభాగానికి వస్తే..
ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, కెమికల్ , మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.అర్హత విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, బికాం, బిఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాదు 2019, 2020, 2021 గ్రాడ్యుయేట్ లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించబడింది. జీతం ఎనిమిది వేల రూపాయలను చెల్లిస్తారు.

3.ట్రేడ్ అప్రెంటీస్ లు : టర్నర్, ఎలక్ట్రీషియన్ , ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ,మెకానిక్, వెల్డర్ .. అర్హత విషయానికొస్తే సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి..2019, 2020, 2021 సంవత్సరాలలో ఉత్తీర్ణులు అయిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించబడింది.

వయోపరిమితి జనవరి 1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా అకడమిక్ మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: drdo.gov.in ద్వారా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరితేదీ..07-02-2022.