BSNL Recharge Plans : ప్రభుత్వ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ కలిగిన రీచార్జ్ ప్లాన్స్ తో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో నెట్వర్క్ కవరేజ్ సరిగా ఉండని నేపథ్యంలో చాలా మంది బిఎస్ఎన్ఎల్ ను సెకండరీ సిమ్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక అలాంటివారి కోసం తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ తీసుకు వచ్చింది. కేవలం రూ.100 లోపే అరుదైన ధరకే రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది BSNL. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.100 లోపు బెస్ట్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రూ.87 రీచార్జ్ ప్లాన్ : రూ.87 తో మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కు రీచార్జ్ చేసుకుంటే మొత్తం 14 రోజులు పాటూ వ్యాలిడిటీ తో లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు 1 GB డేటా అలాగే 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది.1 GB డైలీ లిమిట్ కంప్లీట్ అయిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కాల్స్ మాట్లాడే వారికి ఈ ప్లాన్ చాలా బెనిఫిట్ గా ఉంటుంది.
రూ.97 రీఛార్జి ప్లాన్ : రూ.100లోపు లభించే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ లో ఇది కూడా ఒకటి. రూ.97 ప్లాన్ ను కనుక మీరు తీసుకుంటే ప్రతిరోజు 2gb డేటా తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ని కూడా పొందవచ్చు. ఇక అలాగే 18 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు డేటా అయిపోతే 80 కేబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ డేటా కాల్స్ బెనిఫిట్స్ పొందాలనుకునే వారికి ఇది కచ్చితంగా సెట్ అవుతుంది.
రూ.49 రీఛార్జ్ ప్లాన్ : సిమ్ యాక్టివ్ లో ఉంటే సరిపోతుందనుకునే వారికి బెస్ట్ చీపెస్ట్ ప్లాన్ ఇదే కావడం గమనార్హం. ఇక రూ.49రీఛార్జి చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిలీట్ పాటు 100 నిమిషాల కాల్స్ తో పాటు 1 GB డేటా లభిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ మాత్రమే కోరుకునే వారికి చీపెస్ట్ ప్లాన్ గా ఇది అందుబాటులో ఉంది. ఇక చూసారు కదా తక్కువ బడ్జెట్లో అధిక డేటా, వాయిస్ కాలింగ్ అందించే బిఎస్ఎన్ఎల్ తో మరిన్ని లాభాలను పొందవచ్చు. అంతేకాదు తక్కువ రీఛార్జి ప్లాన్స్ కి ఎక్కువ బెనిఫిట్స్ అందించడానికి సిద్ధంగా ఉంది బిఎస్ఎన్ఎల్.