Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ సెవెన్ సెప్టెంబర్ మూడవ తారీకు నుండి ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సరిగ్గా ఈ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలోనే అంతర్జాతీయ వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతూ ఉండటంతో… షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షోపై ఇంట్రెస్ట్ వచ్చేలా అనేక మార్పులు చేయడంతో పాటు టాప్ మోస్ట్ సెలబ్రిటీల చేత ఈ సీజన్ ఆడించనున్నట్లు సమాచారం.
అంతేకాదు గతంలో ఆడించిన టాస్కులు కాకుండా.. కొత్త కొత్త కార్యక్రమాలతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉండబోతుందట. దీనిలో భాగంగా ఇప్పటికే హౌస్ సెట్టింగ్స్ మొత్తం కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి సీజన్ సెవెన్ లో తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేసిన టాప్ మోస్ట్ యాంకర్ తో పాటు.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ ఓ ప్రముఖ సినీ జర్నలిస్టు కూడా పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నా యి. ఇక యధావిధిగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా రాణించారు.
రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి హోస్ట్ గా నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. సీజన్ సెవెన్ కి హోస్ట్ మారబోతున్నట్లు తొలిత వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రానా, బాలకృష్ణ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా సీజన్ సెవెన్ ప్రోమోలో నాగార్జున ఉండటంతో ఆయనే కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3 నుండి సీజన్ సెవెన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేమికులు ఆనందంగా ఉన్నారు.