Good News : ఎస్బిఐ.. ఐ సి ఐ సి ఐ .. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకుల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వడ్డీ రేట్లు చాలామందికి హర్షాన్ని కలిగిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లు 2022 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటీవల తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్లు 2.80 శాతం నుండి 5.25 శాతం మధ్యలో ఇప్పుడు తీసుకొచ్చిన వడ్డీ రేట్లు కూడా పెరగడం గమనార్హం.
బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది.ఈ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు స్పెషల్ వడ్డీరేటును కూడా ఆఫర్ చేయడం గమనార్హం. అంతేకాదు అదనంగా 0.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు గా బ్యాంకు తాజాగా వెల్లడించింది. ఇక 7 నుంచి 45 రోజుల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసేవారికి 2.80 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక అలాగే 46 రోజుల నుంచి 180 రోజులు వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 3.7 శాతం వడ్డీ లభించడం గమనార్హం.

అదేవిధంగా 181 వ రోజు నుంచి 270 రోజులపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 4.30 శాతం వడ్డీ అలాగే 271 రోజుల నుంచి సంవత్సరం వరకు డిపాజిట్ చేసేవారికి 4.4 శాతం వడ్డీ రేట్లు ఇవ్వనున్నారు.ఇక సంవత్సరానికి 5 శాతం వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తూ ఉండగా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవారికి 5.1 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. ఇక మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 5.25 శాతం వడ్డీ రేట్లను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేయడం గమనార్హం.