Airtel Customers : ప్రస్తుతం ప్రముఖ ప్రైవేటు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తమ కస్టమర్లకు శుభవార్త తీసుకొచ్చింది. ఇక ఎప్పటికప్పుడు అధునాతన ప్లాన్స్ తో ముందుకు వచ్చే ఎయిర్టెల్ ఇప్పుడు కూడా ఏడాది పాటు వ్యాలిడిటీతో తక్కువ ధరకే అందించడానికి రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు తక్కువ ధరకే ఏడాది పాటు రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది. కాబట్టి ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే మీరు కూడా ఎయిర్టెల్ కస్టమర్ అయితే నెలవారి రీచార్జ్ ను తీసివేయాలనుకుంటే సంవత్సరం చెల్లుబాటు తో వచ్చే ఎయిర్టెల్ ప్లాన్ గురించి తప్పకుండా తెలుసుకోండి.
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ తో మీకు నెలకు రూ.200 కంటే తక్కువ ధరతో సంవత్సరం పొడువునా చెల్లుబాటును పొందవచ్చు. రూ.1799 రీఛార్జ్ ప్లాన్స్ తో 365 రోజులపాటు వ్యాలిడిటీని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఏడాది పాటు 24GB హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది. అంతేకాదు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందడమే కాకుండా ఇతర టెలికాం సర్వీసులకు కూడా మీరు ఉచితంగా సంవత్సరం పాటు నిరభ్యంతరాయంగా.. నిర్విరామంగా మాట్లాడుకోవచ్చు. అంతేకాదు విదేశాలకు ఫోన్ చేసినా సరే ఎస్టిడి, రోమింగ్ కూడా పడదు. ఇక 365 రోజులకు గాను 3600 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇక 100 రూపాయల ఫాస్ట్ ట్యాగ్ క్యాష్ బ్యాక్ ను కూడా పొందవచ్చు. ఇక అపోలో 24/7 సర్కిల్ మూడు నెలలపాటు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ముఖ్యంగా సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ ఉత్తమమైనది. తక్కువ ధరకే సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఇక వీటితోపాటు మరెన్నో ఎయిర్టెల్ ప్లాన్స్ కూడా మీకు లభిస్తాయి ఇకపోతే 5G నెట్వర్క్ సర్వీస్ ను త్వరలోనే ప్రవేశ పెట్టడానికి సిద్ధంగా ఉంది ఎయిర్టెల్. ఇక 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి అని ఇప్పుడు ఈ డిసెంబర్ లోగా కొన్ని సెలెక్ట్ చేసిన నగరాలలో 5G సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది. ఎయిర్టెల్ 4G సిమ్ తో 5G నెట్వర్క్ సేవలను పొందవచ్చు అని కూడా స్పష్టం చేసింది ఎయిర్టెల్.