Best Recharge Plans : దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థ అయినటువంటి భారతీ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే రిలయన్స్ జియో తో పోలిస్తే.. ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కష్టమర్లకు మాత్రం మంచి రాయితీతో కూడిన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇకపోతే మీరు కూడా ఎయిర్టెల్ కస్టమరా? ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే తక్కువ ధరతో లభించే బెస్ట్ ప్లాన్ వివరాలు కూడా ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అది కూడా తక్కువ ధరకే సంవత్సరం పాటు వ్యాలిడిటీ అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ మీకోసం తీసుకొచ్చాము.
మరి ఆ ప్లాన్ యొక్క వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇకపోతే ఇటీవల కాలంలో ఎక్కువగా చెల్లుబాటు అయ్యే ప్లాన్లను కోరుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అందుకే అలాంటి వారి కోసం ఎయిర్టెల్ రకరకాల ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. మీరు కూడా ఎయిర్టెల్ కస్టమర్ లు అయి, నెల వారీ రీచార్జ్ ను తీసివేయాలనుకుంటే 365 రోజుల చెల్లుబాటులో ఉండే ఎయిర్టెల్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ తో మీరు నెలకు రూ.200 కంటే తక్కువ ధరతో ఏడాది పొడవునా చెల్లుబాటును పొందవచ్చు. ఇక ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ.1799.. ఏడాదిపాటు వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ఇది.
ఈ ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటే కస్టమర్లు సంవత్సరానికి 3,600 ఉచిత ఎస్ఎంఎస్లను పొందుతారు.. ఇక ఎయిర్టెల్ ప్లాన్ యొక్క వినియోగదారులు ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను పొందే అవకాశం ఉంటుంది. ఇక డేటా ముగిసిన తర్వాత డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ అయిపోయిన వెంటనే 64 Kbps వేగంతో ఇంటర్నెట్ ను వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్లాన్ తో వినియోగదారులు ఉచిత హాల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి సేవలను ఉచితంగా పొందుతారు. అంతేకాకుండా ఫాస్ట్ ట్యాగ్ లో వంద రూపాయల క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది.. ఇకపోతే ఈ ప్లాన్ మీకు నెలకు రూ.200 కంటే తక్కువగానే లభించడం గమనార్హం.