Amazon Prime : టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్.. తమ కస్టమర్లకు పలు ప్లాన్ లపై ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది.. ఇక అమెజాన్ ప్రైమ్ మొబైల్ వెర్షన్ కి ఉచిత సబ్స్క్రిప్షన్ ను పొందే విధంగా కొన్ని రకాల ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మరి ఎయిర్టెల్ అందిస్తున్న అమెజాన్ ప్రీపెయిడ్ ప్లాన్ ల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
ఎయిర్టెల్ రూ.359 ప్లాన్ : కంపెనీ ప్రకారం ఈ ప్లాన్ 28 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎక్స్ట్రీమ్ మొబైల్ ప్యాక్, అపోలో 24/7 సర్కిల్ కు సబ్స్క్రిప్షన్ కూడా అందించబడుతుంది.
ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ : ఇక ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులపాటు ఉంటుంది. ప్రతిరోజు 3GB డేటా పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు ఎక్స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ కూడా పొందుతారు. ఫాస్ట్ ట్యాగ్ లో వంద రూపాయల క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాదు అపోలో 24/7 సర్కిల్ కు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందుతారు.
ఎయిర్టెల్ రూ.999 ప్లాన్ : ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక ప్రతిరోజు కష్టమర్లు 2.5 జిబి డేటాను పొందవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది.అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు ఎక్స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ కూడా పొందుతారు. ఫాస్ట్ ట్యాగ్ లో వంద రూపాయల క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాదు అపోలో 24/7 సర్కిల్ కు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందుతారు. మొబైల్ ఎడిషన్ ఉచితంగా పొందే ఈ అద్భుతమైన ప్లాన్స్ ను మీరు రీచార్జ్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు అన్లిమిటెడ్ వినోదాన్ని కూడా పొందవచ్చు.