Airtel Customers : టెలికాం దిగ్గజ సంస్థ అయినటువంటి భారతీయ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఇప్పుడు తాజాగా మరొక 2 ప్రీపెయిడ్ ప్లాన్స్ ను కస్టమర్ల కోసం తీసుకురావడం గమనార్హం. ఇకపోతే ఈ కొత్త ప్లాన్లు వినియోగదారులకు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇప్పటికీ జియో నుండి పొందగలిగే అంత సరసమైనవి కానప్పటికీ ఎయిర్టెల్ ఉన్నత ప్రీమియం ప్లేయర్ గా పిలిపించుకోవడంలో గర్వపడుతుందని చెప్పవచ్చు. టెలికాం మార్కెట్లో అగ్రపోటిదారు కంటే ఎక్కువ టారీఫ్ లను కలిగి ఉంది.
మరి కొత్తగా విడుదలైన ఈ రెండు ప్లాన్ల యొక్క ప్రయోజనాల గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ఎయిర్టెల్ రూ.519 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్.. భారతి ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్.. కస్టమర్లకు 60 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తుంది ఇక ఈ 60 రోజులపాటు మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1.5 GB డేటాను పొందవచ్చు ఇక అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇతర ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా అందించనుంది. ఇక వీటిలో అపోలో 24/7 ఫ్రీ సర్కిల్.. లింక్ మ్యూజిక్.. హలో ట్యూన్స్.. ఫస్ట్ ట్యాగ్లో 100 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఇక రోజువారి డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 కేబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వినియోగించవచ్చు.
ఎయిర్టెల్ రూ.779 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్.. ఇక ఈ ప్లాన్ కస్టమర్లకు 90 రోజులు వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇక ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1.5 GB డేటాను పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు 100 ఎస్ఎంఎస్లను పొందుతారు. ఇక అదనపు ప్రయోజనాల విషయానికి..ఎయిర్టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా అందించనుంది. ఇక వీటిలో అపోలో 24/7 ఫ్రీ సర్కిల్.. లింక్ మ్యూజిక్.. హలో ట్యూన్స్.. ఫస్ట్ ట్యాగ్లో 100 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఇక రోజువారి డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 కేబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వినియోగించవచ్చు. మరి ఎయిర్టెల్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్లు కూడా కస్టమర్లకు సరసమైన ధర కే లభించడం గమనార్హం. ఇకపోతే ఇక్కడ తక్కువ చెల్లుబాటు లేదా ఎక్కువ చెల్లుబాటు ఎంపిక తీసుకోవడానికి మీరు ఇచ్చిన సమయంలో ఎంత ఖర్చు చేయవచ్చో నిర్ణయం తీసుకున్న తర్వాతనే రీఛార్జ్ ప్లాన్ తీసుకోవడం మంచిది.