Good News : దేశంలోనే దిగ్గజ టెలికాం సంస్థలైనటువంటి ఎయిర్టెల్ అలాగే జియో తమ కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తక్కువ డేటా వినియోగించే వారికి సూపర్ ఆఫర్లను అందించడానికి సిద్ధం అయ్యాయి. జియో అలాగే ఎయిర్టెల్ కంపెనీలు. ముఖ్యంగా 100 రూపాయల కంటే తక్కువ ధరకే ఈ ప్లాన్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఇకపోతే ఎయిర్టెల్ యొక్క చౌక అయిన ప్లాను రూ.99 నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో జియో నుంచి మరొక ప్లాన్ రూ.91 నుండి ప్రారంభం అవడం జరుగుతుంది.
ఇకపోతే జియో అందిస్తున్న ప్లాన్ విషయానికి వస్తే రూ.91 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజులపాటు చెల్లుబాటును పొందవచ్చు . అలాగే ఈ ప్లాన్ లో కస్టమర్లకు అపరిమిత కాలింగ్ తో పాటు 50 ఎస్ఎంఎస్లను పొందడమే. కాకుండా 28 రోజులకు గాను 3gb డేటా లభిస్తుంది ముఖ్యంగా ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు కాబట్టి రోజుకు 100 ఎంబి డేటాను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక అలాగే జియో యాప్ లను సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది. ఇక అంతే కాదు ఈ ప్లాన్ ద్వారా ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉండడం గమనార్హం. ఇక భారతి ఎయిర్టెల్ విషయానికి వస్తే..
ఎయిర్టెల్ అందిస్తున్న అతి చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటి అంటే అది కేవలం రూ.99 ప్లాన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంతమంది పెద్దవాళ్లకు డేటాతో పెద్దగా పని ఉండదు. కేవలం వారు వాయిస్ కాలింగ్ కోసం మాత్రమే రీచార్జ్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ రీఛార్జ్ చాలా ఉత్తమమైనదని చెప్పవచ్చు. ముఖ్యంగా రూ.99 తో ప్రీపెయిడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే 28 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది అంతేకాదు 200 ఎంబి డేటా కూడా అందుబాటులో ఉంటుంది అయితే ఈ ప్లాన్ ద్వారా మీకు ఎస్ఎంఎస్ లు లభించవు . కేవలం రూ.99 కి వాయిస్ కాలింగ్ మాత్రమే లభిస్తుంది. అంటే ఒక సెకండ్ కి ఒక పైసా టాక్ టైం లాగా మీరు దీనిని వాడుకోవచ్చు.