OTT Apps : ఈ మధ్యకాలంలో సినిమా విడుదలైన నాలుగు వారాలలోపే ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు కన్నుల పండుగ చేస్తున్న విషయం తెలిసిందే . కానీ ఈ ఓటీటీ యాప్ లను సబ్స్క్రిప్షన్ పొందాలి అంటే డబ్బుతో కూడుకున్న పని. ఇక వీటిని ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందడం ఎలాగో చాలామందికి తెలియక మంచి మంచి సినిమాలను చూడడం మిస్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు రిలయన్స్ జియో మీకోసం కేవలం మీ స్మార్ట్ ఫోన్ కు రీచార్జ్ చేసుకుంటే చాలు ఇక ఉచితంగా అన్ని ఓటీటీ యాప్ లకి సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ఇక మొబైల్ ఎడిషన్ తో పాటు టీవీ స్ట్రీమింగ్ కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది మరి రిలయన్స్ జియో అందిస్తున్న ఆ ప్లాన్స్ ఏంటో? ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. OTT యాప్ లు అనగానే ముఖ్యంగా మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాయి ఇక వీటిని మీరు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రూ.399 జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ మీకు నెల రోజులపాటు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది .ముఖ్యంగా ఈ ప్లాన్ వేసుకున్నప్పుడు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు 75జిబి హై స్పీడ్ డేటా పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంతే కాదు 200GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.
ఇక మరికొన్ని రకాల ఫ్యామిలీ ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్స్ మీకు అదనపు సిమ్ కార్డును కూడా తీసుకొస్తాయి. ఇక అవేమిటంటే .. రూ.599 జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా మీరు రీఛార్జి చేసుకున్నట్లయితే అదనంగా ఒక సిమ్ కార్డు కూడా లభిస్తుంది. అలాగే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ వంటి యాప్ ఓటీటీ యాప్లను సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో మీరు రీఛార్జ్ చేసుకుంటే అదనంగా రెండు సిమ్ కార్డులను ఉచితంగా పొందవచ్చు.అయితే ఇక్కడ అందించిన ప్లాన్ లకు మీరు జీఎస్టీ ని కలుపుకోవాల్సి ఉంటుంది.