Allari Naresh : ఆ హీరోయిన్స్ అంద‌రి ముందు నా ప‌రువు తీయాల‌నుకున్నారు.. అల్ల‌రి న‌రేష్ వాళ్ల‌కి గ‌ట్టిగా బుద్ది చెప్పాడు..!

Allari Naresh : కిత‌కిత‌లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది గీతా సింగ్. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో భారీగానే అవకాశాలు వచ్చాయి. ‘శశిరేఖా పరిణయం’, ‘సీమ టపాకాయ్‌’, ‘కెవ్వు కేక’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి సినిమాలతో లేడి కమేడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతా ఏమైందో ఏమో కాని, గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం మానేసింది. చివరిగా ఈమె 2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలోక‌నిపించింది. అయితూ తాజాగా ఈమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వూ ఇవ్వ‌గా, ఆ ఇంటర్వూలో తన కష్టాల గురించి చెప్పుకుంటూ బాధపడింది.

geetha-singh-stunning-comments-on-mumbai-heroines
geetha-singh-stunning-comments-on-mumbai-heroines

Allari Naresh : సినిమా క‌ష్టాలు..

ఒక సినిమా షూటింగ్ సమ‌యంలో నేను క్యారవాన్ ఎక్కాను. అప్పుడ అందులో ఉన్న బాంబే హీరోయిన్స్ …ఈమె జూనియర్ ఆర్టిస్ట్ కదా… క్యారవాన్ ఎందుకు ఎక్కింది అని న్ననన్ను అవమానించారు. నా గురించి తెలియ‌క వాళ్లు అలా అంటున్నారు ఏమో అని బ‌య‌ట‌కు వ‌చ్చేసారు.. ఈ విషయం అల్లరి నరేష్ కు తెలియడంతో… నన్ను తీసుకుని వెళ్లి… గీతా నా ఫస్ట్ హీరోయిన్ అని చెప్పారు . ఆమె నుంచే నాకు బ్రేక్ వచ్చిందని చెప్పార‌ని, అప్పుడు వెంటనే వాళ్ళు మేడం అని పిలిచార‌ని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.

అల్లరి నరేష్, గీతా సింగ్ నటించిన ‘కితకితలు’ మూవీ పెద్ద‌ బ్లాక్‌‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. 2006లో రిలీజైన ఈ మూవీతో నరేష్, గీతా సింగ్‌కి మంచి పేరు రావ‌డంతో పాటు క‌లెక్ష‌న్స్ కూడా బాగానే వ‌చ్చాయి. కేవలం రూ.85 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ.9 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ని కలెక్ట్ చేసింది. ఈ మూవీకి అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యానారాయణ డైరెక్టర్ కావ‌డం విశేషం. అయితే గీతా సింగ్ అప్ప‌ట్లో తనను అయినవాళ్లే మోసం చేశారని, ఒకరి దగ్గర చిట్టీలు వేస్తే.. అతను ఏకంగా 6 కోట్లు మోసం చేశాడని కూడా చెప్పుకొచ్చింది.