Beauty Tips : చర్మం మెరిసి పోవాలి అంటే ఈ చిట్కా పాటించండి..!!

Beauty Tips : చర్మాన్ని ఆరోగ్యంగా , అందంగా తీర్చి దిద్దుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో సొంటి పొడి అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుందని తాజాగా సైంటిస్టులు సైతం నిరూపించారు. ఇక అల్లాన్ని ఎండబెడితే వచ్చే దానిని మనం సొంటి అని అంటారని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే అల్లం పూర్తిగా ఎండుతుందో అప్పుడు అందులో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి పెరుగుతాయట. ఫలితంగా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సాధారణంగా సొంటిని పొడిచేసుకుని పాలలో కలుపుకొని తాగడం వల్ల గ్యాస్ , జీర్ణకోశ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి తీసుకొని అందుకు నాలుగు కప్పుల నీళ్ళు తీసుకొని బాగా మరిగించాలి . ఇక ఈ నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పులు అయ్యేవరకు బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇక దీనికి రెండు టేబుల్ స్పూన్ల లావెండర్ ఆయిల్ కలిపి ఫ్రిజ్లో పెట్టుకొని నిల్వ ఉంచాలి. ఇక దీనిని మీరు సొంటి ఆయిల్ గా ఉపయోగించవచ్చు.మీరు ఏ భాగాలలో అయితే మీ చర్మం రంగు పెరగాలని అనుకుంటున్నారో ఆ భాగంలో కాటన్ తో ఈ మిశ్రమాన్ని తీసుకుని ఆ భాగాలలో అప్లై చేసి సుమారుగా 20 నిమిషాలపాటు వదిలేయాలి.

Follow this tip to make your skin glow
Follow this tip to make your skin glow

ఈ మిశ్రమంలో ఉండే జింజిరాల్స్ అనే కెమికల్స్ చర్మపు రంగును మెరుగు పరుస్తాయి. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలను తొలగించడం లో ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఎండకు, గాలికి , పొల్యూషన్ కి స్కిన్ సెల్స్ ఎక్కువగా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఫలితంగా మీ చర్మం నిర్జీవంగా మారి కళ తప్పుతుంది. ఈ ఆయిల్ మీరు ముఖంపై అప్లై చేయడం వల్ల సత్వర ఫలితం లభిస్తుంది. ఇక దీని వల్ల ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. నాచురల్ గా ఉన్న వాటిని మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే కేవలం కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ పొందవచ్చు.