FLIPKART:అసలు సిసలైన ఆఫర్ ఇదే.. ఆ స్మార్ట్ ఫోన్ పై రూ.16,300 తగ్గింపు..!

ప్రస్తుతం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లో డిస్కౌంట్ ధరలను ఫ్లిప్ కార్ట్ రివీల్ చేస్తూ వస్తోంది . ఇక ఈ క్రమంలోని ఒక స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.16,300 డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం గూగుల్ ఇండియాలో రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.16,300 డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ పై ఇంత భారీ డిస్కౌంట్ లభించడం ఇదే మొదటిసారి. ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ప్రతిసారి కూడా ఇలాంటి ఆఫర్ కనీసం ఒక్కటైనా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ఫ్లిప్ కార్ట్ ఈ ఏడాది కూడా అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించడంతో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా కొనవచ్చు అని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే మనకు లభ్యమవుతుంది.6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంటిలో మాత్రమే రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.43,999. ప్రస్తుతం మీరు ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సెల్ లో ఐసిఐసిఐ బ్యాంక్ , ఆక్సిస్ బ్యాంక్ ఆఫర్స్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.27,699 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే..60 Hz రీఫ్రెష్ రేట్ తో పాటు 6.14 అంగుళాల ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇక ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యపడదు. ఇక ఐదు సంవత్సరాలు పాటు పిక్సెల్ అప్డేట్స్ కూడా లభిస్తాయి.

కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.ఇక సెల్ఫీ వీడియోల కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. 4410 mah బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. బ్యాటరీ సేవర్ ఫీచర్ తో 72 గంటల పాటూ బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు.