Flipkart Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లపై 80% తగ్గింపు..!!

Flipkart Sale : సాధారణంగా ఈ – కామర్స్ సంస్థలైనటువంటి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఏదైనా పండుగలు ముఖ్యమైన రోజులలో మాత్రమే ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ ఇటీవల ఈనెల 23వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ లో అతిపెద్ద బిగ్ సేవింగ్ డే సేల్ మొదలవుతోంది. ఇక ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ స్థాయిలో తగ్గింపు లభిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు తోపాటు మరెన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందివ్వడానికి సిద్ధం అయ్యింది ఫ్లిప్కార్ట్. ముఖ్యంగా ఈ సేల్ జూలై 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇకపోతే ఫ్లిప్కార్ట్ ఇదివరకే ఒప్పో రెనో 5ప్రో.. ఐఫోన్ 11.. మోటో జి31 వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. సేల్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరిన్ని డీల్స్ ప్రకటించడం గమనార్హం.

Advertisement

ఇకపోతే స్మార్ట్ ఫోన్ దిగజాలైనటువంటి ఒప్పో, వివో, మోటోరోలా, ఆపిల్ వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డీల్స్ తో అందివ్వడానికి సిద్ధంగా ఉంది . ఇకపోతే ఫ్లిప్కార్ట్ డేస్ సేల్ లో మీరు ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ముఖ్యంగా కస్టమర్లు హెడ్ ఫోన్లు, స్పీకర్లను 70% వరకు డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఇక రూటర్లు, కీబోర్డ్ లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి 99 రూపాయలు నుంచి ప్రారంభం అవుతాయి. ఇక స్మార్ట్ వాచ్ లపై 65% డిస్కౌంట్ లభించగా , టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు టాబ్లెట్ పీసీ లపై 45 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

Advertisement
Flipkart Big Saving Day Sale.. 80% Discount on Electronic Gadgets
Flipkart Big Saving Day Sale.. 80% Discount on Electronic Gadgets

ఇకపోతే సేవింగ్స్ డే సేల్ సమయంలో కంపెనీ ఉదయం 12:00 గంటలకు అలాగే ఉదయం 8:00 గంటలకు సాయంత్రం 4:00గంటలకు లేటెస్ట్ డీల్స్ విడుదల చేస్తుంది. ఇకపోతే అదనపు డిస్కౌంట్ లను అందివ్వడమే కాకుండా మరికొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా కస్టమర్లకు అందింవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కంపెనీలు . ఇకపోతే కొన్ని ప్రోడక్ట్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందివ్వడం జరిగింది. ఇకపోతే ఫ్లిప్కార్ట్ పోటీ దారుడైన అమెజాన్ కూడా ప్రైమ్ డే సేల్ ను జూలై 23 నుంచి జూలై 24 వరకు నిర్వహించనుంది ఇకపోతే కంపెనీ ఆఫర్లు మాత్రం జూలై 27 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement