Flipkart Big Billion Days ; కస్టమర్లు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించింది. ఇక ఈ రెండు సేల్స్ దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించడానికి సిద్ధం అవుతుంది. ఇకపోతే ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇకపోతే ఫ్లిప్ కార్ట్ సేల్ తో పాటు అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ షాపింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్ కొనియోగదారులు ఐఫోన్ 12 పై, ఐ ఫోన్ 13 పై అనేక డీల్ అలాగే తగ్గింపులను కూడా ఆశించవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లను కూడా క్లబ్ చేస్తోందని భావిస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు కార్డు లేదా యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులైతే 10% తక్షణ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్లపై కూడా గొప్ప ఆఫర్లను అందిస్తూ ఉండడం గమనార్హం.
రియల్ మీ, వివో, యాపిల్, సాంసంగ్, ఐఫోన్, పోకో వంటి అత్యధికంగా అమ్ముడు అవుతున్న స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అందజేస్తుందని సమాచారం. అంతేకాదు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా భారీ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాక్సెసరీస్ లు, టీవీలు ఇతర గృహ ఉపకారణాలపై కూడా కొనియోగదారులు ఏకంగా 80% వరకు తగ్గింపును పొందవచ్చు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఫ్లిప్ కార్ట్ నుంచి కిచెన్ లేదా వంట ఉపకరణాలను కొనుగోలు చేస్తే అదనంగా 85% తగ్గింపు అందించనుందని సమాచారం. అంతేకాదు పిల్లల టాయ్స్ పై కూడా ఈసారి ఆఫర్లు లభించబోతున్నాయట.