ఏపీ పదో తరగతి రిజల్ట్స్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో 72.26% స్టూడెంట్స్ పాసయ్యారు. కాగా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్లాసులను కొన్ని పాఠశాలలలో బోధించాలని ప్లాన్ చేసింది.
ప్రతి జిల్లాలలోని కొన్ని పాఠశాలలను ఎంపిక చేసుకుని వాటిలో క్లాసులు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల ఫెయిల్ అయిన విద్యార్థులు మరింత సన్నద్ధమై సప్లిమెంటరీ లో పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చాలా కీలకం కాబట్టి తప్పనిసరిగా పాస్ అయ్యి జీవితంలో ముందుకు వెళ్లాలనుకునేవారు ఈ క్లాసులకు హాజరు కావచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులకు ఈనెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు రాయాలనుకునే వారు మే 17లోగా ఫీజు చెల్లించాలని మంత్రి బొత్స సూచించారు. మే 22వ తేదీ వరకు ఈ ఫీజు చెల్లించవచ్చు.