Flash News: సమంతపై తొలిసారి పెదవి విప్పిన నాగచైతన్య..

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత 2021, అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఎట్టకేలకు సమంత మాజీ భర్త నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో ఆమె గురించి పెదవి విప్పాడు. విడిపోయిన తర్వాత తమ గురించి మూడవ వ్యక్తులు చాలా చెడ్డగా మాట్లాడారని, దానివల్ల తానెంతో బాధపడ్డానని చెప్పుకొచ్చాడు.

“సమంత ఒక లవ్లీ పర్సన్. ఆమెకు ప్రపంచంలోని సంతోషాన్నంతా పొందగలిగే అర్హత ఉంది. కానీ మీడియా ఊహాగానాలు చేసినప్పుడే మా మధ్య గొడవలు జరుగుతాయి. ప్రజల దృష్టిలో ఇద్దరి గౌరవం పోయింది. దాని గురించి నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నా. ఏదేమైనా ఇప్పుడు మేము లైఫ్ లో ఇద్దరం ముందుకు కొనసాగుతున్నాం” అని నాగచైతన్య తెలిపాడు. కస్టడీ మూవీ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇదే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడాడు.