OnePlus Phone : వన్ ప్లస్ నుంచీ మొదటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ విడుదల..!!

OnePlus Phone : వన్ ప్లస్.. భారతదేశంలో నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్ లను తాజాగా విడుదల చేసింది. ఇకపోతే మనదేశంలో ఈ బ్రాండ్ నుంచి విడుదలైన మొట్టమొదటి వైర్డ్ ఇయర్ ఫోన్లు ఇవే కావడం విశేషం. ఇక అద్భుతమైన డిజైన్ తో అతి ముఖ్యమైన ఫీచర్లతో ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ తక్కువ ధరకే అందుబాటులోకి రావడం గమనార్హం. ముఖ్యంగా వన్ ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్ ధర భారత దేశంలో అతి తక్కువ ధరకే కేవలం రూ.799 గా నిర్ణయించబడింది. ఇక ఇవి కూడా వన్ ప్లస్ నుండి ఇంత తక్కువ ధరకే లభిస్తూ ఉండడంతో కస్టమర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . వీటిని కొనుగోలు చేయాలని ఆశించేవారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.

ఇక వీటిని డిజైన్ ని కనుక మనం చూసినట్లయితే ఈ ఇయర్ ఫోన్స్.. వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెడ్ సిరీస్ ను పోలి ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా సిగ్నేచర్ బ్లాక్ రెడ్ కలర్ లో అందుబాటులో ఉంటాయని వన్ ప్లస్ కంపెనీ స్పష్టం చేసింది. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే అంతరాయం లేని మ్యూజిక్ అనుభూతి కోసం ప్రత్యేకమైన పద్ధతిలో ఇయర్ ఫోన్ లోపల మ్యాగ్నెట్ ఫీచర్ ను అందిస్తున్నారు. ఇక అదనంగా ఈజీ ఆడియో కంట్రోలింగ్ కోసం బటన్స్ కూడా అందించడం గమనార్హం. ఇకపోతే వాటిని ఒకదానితో ఒకటి స్నాప్ చేయడం వల్ల ప్లే బ్యాక్ ను పాస్ మరియు రెస్యూమ్ చేయవచ్చు.

First Ward earphones released from OnePlus
First Ward earphones released from OnePlus

ఈ ఇయర్ ఫోన్స్ గుండ్రని డిజైన్ ను కలిగి ఉంటాయి. కాబట్టి యూజర్లు వాటిని గంటలపాటు సౌకర్యంగా చెవికి ధరించవచ్చు అని వన్ ప్లస్ తెలిపింది. ముఖ్యంగా బ్రాండ్ బాక్సులో అదనంగా సిలికాన్ బడ్స్ ని కూడా కంపెనీ అందిస్తోంది. మ్యూజిక్ కంట్రోలింగ్ కాల్స్ ఆక్సిస్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ను ప్రారంభించడం కోసం హార్డ్ బటన్లతో కూడిన ఇన్ లైన్ మైకులు కూడా కలిగి ఉంటాయి. ముఖ్యంగా బోల్డ్ ఆడియో కోసం 9.2 mm డైనమిక్ డ్రైవర్లతో పాటు 0.42 సీసీ సౌండ్ కేవిటిని కూడా కలిగి ఉన్నాయి. ఇకపోతే నార్డ్ విభాగం నుంచి కంపెనీ విడుదల చేసిన మూడో ఉత్పత్తిగా ఈ నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్లు నిలిచాయని చెప్పవచ్చు. అంతేకాదు త్వరలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇయర్ ఫోన్స్ అమ్మకానికి అందుబాటులోకి రావడం జరుగుతుంది.