Manchu Manoj.. ఎట్టకేలకు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల ప్రేమాయణానికి తెరపడింది. మంచు మనోజ్ , భూమా మౌనిక రెడ్డిల పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి మరి చేస్తోందని.. మొన్న మెహందీ, నిన్న సంగీత ఫంక్షన్ లు చాలా ఘనంగా జరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. కానీ భూమా మౌనిక రెడ్డిని ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నట్లు మంచు హీరో మనోజ్ కూడా అధికారికంగా ప్రకటించారు. పెళ్లికూతురుగా తయారైన మౌనిక రెడ్డి ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేశారు మంచు మనోజ్.
“మనోజ్ వెడ్స్ మౌనిక” అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేశారు. ఇకపోతే తన సోదరి మంచు లక్ష్మీ నివాసంలో ఈరోజు రాత్రి 8:30 గంటలకు వీరి వివాహం జరగబోతోంది. మరో విషయం ఏమిటంటే ఈ పెళ్లిని కూడా తన ఇంట్లోనే చేస్తోంది మంచు లక్ష్మి.. మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన అన్న మంచు విష్ణు భార్య వేరోనికా రెడ్డి స్నేహితురాలే ప్రణతి రెడ్డి . 2015లో ఆమెను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు మనోజ్ . కానీ బేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు.. ఇప్పుడు రాత్రి 8:30 గంటలకు భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం జరగబోతోంది.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023