గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు తాజాగా ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారన్న విషయం వార్తలలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా శరత్ బాబు చెల్లెలు ఆయన మరణాన్ని ఖండిస్తూ అలాంటిది ఏమీ జరగలేదని తెలిపింది.
ఇదివరకు తన అన్న శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించింది నిజమేనని.. కాకపోతే., ఆయన చనిపోలేదని.. దేవుడి దయవల్ల అతను అనారోగ్యం నుంచి కోలుకొని ఐసీయూ నుండి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లు ఆవిడ తెలియజేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని శరత్ బాబు చెల్లెలు తెలిపారు.