చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి.. ఇప్పుడు చెప్పుకో పోయే వాటిని మీరు ఫాలో అయితే జుట్టు జన్మలో ఊడమన్నా ఊడదు.. ఈ టిప్స్ అంత అద్భుతంగా పనిచేస్తాయి..

జుట్టుకి కొబ్బరి, ఆలివ్ ఆయిల్ రాసుకుంటే పోషణను అందిస్తాయి. ఈ వెచ్చని నూనెలతో తలమీద బాగా మసాజ్ చేసుకుంటే స్కాల్ఫ్ కి రక్త ప్రసరణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. హీట్ స్టైలింగును నివారించాలి. పదేపదే తలస్నానం చేయడం వల్ల జుట్టుకి పోషణ అందదు. జుట్టును సంరక్షించే సహజ నూనెలు కోల్పోతాయి. అందువలన ప్రతి మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే మంచిది. చలికాలంలో జుట్టును ఎక్కువగా కప్పి ఉంచాలి స్కార్ఫ్, టోపీ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. జుట్టుకు డీప్ కండిషన్ అందించడానికి హెయిర్ మాస్క్ ను వేసుకోవాలి. కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఇది చేయాలి.
కండిషనర్ షాంపులతో మంచి ప్రయోజనాలు ఉంటాయి. చలికాలంలో వేడినీటి స్నానం చేయడం అంత మంచిది కాదు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు కుదుల్లు బలహీనంగా మారుతాయి. జుట్టులోని తేమ అంతా పోయి నిర్జీవంగా మారుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.