Jio Recharge Plans : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో చాలామందికి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు అధిక డేటా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే రిలయన్స్ జియో తాజాగా ముందు అడుగు వేసింది.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తో మీకు అధికంగా డేటా లభించడమే కాదు అధిక వ్యాలిడిటీని కూడా పొందవచ్చు. మరి జియో అందిస్తున్న ఆ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రూ.533 జియో రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 56 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. అదనంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక అలాగే జియో యాప్ లకు సంబంధించి జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ తో పాటు జియో యాప్ లకు సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.
రూ.719 జియో రీఛార్జ్ ప్లాన్ : నీ ప్లాన్ మీకు 84 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక ప్రతిరోజు 2GB డేటా చొప్పున 168 GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఇక యూజర్లు నెలకు కేవలం రూ.240 తో అదనపు బెనిఫిట్స్ 2GB రోజు వారి డేటాను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ కూడా ఒకే విధంగా లభిస్తాయి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, జియో సెక్యూరిటీ, జియో టీవీ, జియో సినిమా తో పాటు జియో యాప్ లు అన్నిటికి కూడా మెంబర్షిప్ పొందవచ్చు
రూ.799 జియో రీఛార్జ్ ప్లాన్ : 56 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజు 2GB డేటా చొప్పున కస్టమర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కంటెంట్ వీక్షించడానికి 112 GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ కింద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక జియో కి సంబంధించిన అన్ని యాప్లకు సభ్యత్వం పొందడంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు.
రూ.1066 జియో రీఛార్జ్ ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2GB డేటా పొందవచ్చు. అంతేకాదు రూ. 499 విలువైన ప్యాక్ ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ని కూడా పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు అలాగే జియో యాప్ లకు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.