AP Employees : జగన్ కి ఝలక్ ఇచ్చిన ఉద్యోగులు

AP Employees : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీలు దూకుడుగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి ఇప్పటికే అయిదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో నాలుగింటికి ఎన్నికలను ఫేస్ చేయనుంది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

employees-issue-on-jagan
employees-issue-on-jagan

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తోన్నారని అన్నారు. అయితే ఉద్యోగులు మాత్రం ఝలక్ ఇచ్చారు..

గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబెషనరీని కూడా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రెండో దఫాలో ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రొబేషరీని ఖరారు చేస్తారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల సమయంలో సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. 12వ పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి నుంచి అమలు అయ్యేలా ఈ పీఆర్సీని వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

సీపీఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ ముందు నుంచీ ఉందని.. ఆ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ లేదా ఇంకా మెరుగైన విధానాన్ని తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కాకపోతే ఉద్యోగులు అందుకు సుముఖత చూపడం లేదని సమాచారం.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి