Hair Problems : అమ్మాయిల అయినా సరే అబ్బాయిలు అయినా సరే అందంగా కనిపించాలంటే తప్పకుండా జుట్టు కూడా ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడుతూ పొడుగ్గా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఇక జుట్టు తెల్లబడుతోంది అంటే చాలు వెంటనే జుట్టుకు డై వేస్తూ తెలుపును కప్పి వేస్తూ ఉంటారు. ఇక ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నా సరే లేదా పార్టీ ఉంది అన్నా సరే వెంటనే జుట్టుకు డై వేసి రంగులు దిద్దుతూ ఉంటారు. ఇకపోతే తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే మనం తీసుకునే ఆహారంలో హార్మోన్స్ సమస్యల వల్ల అధికంగా జుట్టు తెల్లబడుతుంది అని ఒక పరిశోధనలో వెల్లడైంది.ఇకపోతే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలో కూడా జుట్టు నెరిసిపోతోంది. పోషకాలు లోపమే కాదు మరి కొన్ని కారణాల వల్ల కూడా జుట్టు తెల్లబడిపోతోంది
అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి వారసత్వంగా కూడా ఈ మధ్య ఈ సమస్య ఎక్కువవోతోందట. ఇక అదే విధంగా తీసుకునే ఆహారంలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా తెల్లజుట్టు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆహార విషయంలో ఏం చేసినా సరే కల్తీ ఎక్కువగా జరుగుతుంది.. అందుకే మనం తినే ఆహారంలో కల్తీ లేకుండా చూసుకోవాలి.బాగా ఫ్రైడ్ చేసిన వంటలు, రోడ్ సైడ్ దొరికే ఆహార చిరుతిండ్లు, పిజ్జా, బర్గర్ , పాస్తా, గోబీ మంచూరియా, పానీ పూరి , స్పైసీ ఫుడ్స్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు

ఎందుకంటే వీటి వల్ల హార్మోన్లలో తేడాలు వచ్చి జుట్టు రాలిపోయే సమస్య తో పాటు జుట్టు తెల్లబడితే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి తాజా కూరగాయలు.. రోజుకు సరిపడా నీళ్లు.. నిద్ర సరిగా పోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా జుట్టు తెల్లబడే అవకాశాలు తక్కువ..ఒకవేళ జుట్టు తెల్లబడుతుంది అంటే కేవలం గోరింటాకుతో మాత్రమే డై వేసుకోవడం చాలా మంచి పద్ధతి. లేదా ఉసిరికాయ పొడితో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.