KCR : BRS పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అక్టోబర్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. తాజా ప్రకటనతో..ఇంకా ఆరు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఏర్పడటంతో… మిగతా పార్టీలలో కన్ఫ్యూజన్ ఏర్పడింది.
మరోపక్క అధికార పార్టీ BRS మాత్రం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు ముందస్తుగా రెండు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్తున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. BRS జాతీయ పార్టీగా ఆవిష్కరించబడిన తర్వాత… వెళ్తున్న ఎన్నికలు కావడంతో… కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని పక్క వ్యూహాలతో ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.