Doogee S89 Pro : మొబైల్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి అతిపెద్ద సమస్య చార్జింగ్ అని చెప్పవచ్చు. మొబైల్ చార్జింగ్ లేనప్పుడు మనకు ఆ మొబైల్ ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఇక నిరంతరం అధిక బ్యాటరీని కోరుకునే వారికోసం సరికొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అత్యధిక భారీ బ్యాటరీతో ఒక స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమయింది. భారత మార్కెట్లోకి రోజుకో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవ్వడంతో పాటు రోజుకో సరికొత్త టెక్నాలజీతో విడుదలవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ స్మార్ట్ ఫోన్లపై ఈ కామర్స్ దిగ్గజాలైనటువంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు కూడా ఎన్నో ఆఫర్లను తీసుకురావడం జరిగింది.
ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి అనేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక ఇందులో భాగంగానే తాజాగా ఫోన్ DOOGEE S89 ప్రో స్మార్ట్ మొబైల్ కూడా లాంచింగ్ కు సిద్ధంగా ఉంది .ఇక ఈరోజు ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ బ్యాటరీ 12000 Mah వంటి పవర్ఫుల్ బ్యాటరీతో విడుదల కావడం గమనార్హం. ఇక ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో Media tek Helio P90 చిప్ కలిగి ఉంటుంది. S89 ప్రో స్మార్ట్ ఫోన్ బ్యాట్ మాన్ థీమ్ డిస్ప్లే తో మీకు లభిస్తుంది. ఇకపోతే ఆండ్రాయిడ్ 12తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. 6.3 అంగుళాల ఎల్సిడి ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ఈ స్మార్ట్ మొబైల్ మల్టీకలర్ బ్యాట్మన్ లైట్ తో లభిస్తుంది.
ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8 GB ర్యామ్ అలాగే 256 GB స్టోరేజ్ వేరియంట్ తో ఈ స్మార్ట్ మొబైల్ మనకు లభిస్తుంది. ఇక కెమెరా చూసుకున్నట్లయితే 64 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా అలాగే 20 మెగాపిక్సల్ నైట్ షూటర్ అలాగే 8 మెగాపిక్సల్ మైక్రో వైడ్ యాంగిల్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ షూటర్ కెమెరా కూడా ఇందులో అమర్చడం గమనార్హం. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ను కూడా పొందుపరిచారు. ఇక ఇండియన్ మార్కెట్లో దీని ధర కేవలం రూ. 19, 000 మాత్రమే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఆఫర్ కేవలం జూలై 29 వరకే .. ఆ తర్వాత నుండి ఈ ఫోన్ ధర రూ.55, 000 గా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.