Singer Sunitha : ఇలాంటి వీడియో లు అస్సలు పెట్టద్దు .. ఇన్ స్టా వీడియో చూసి సింగర్ సునీత మీద సీరియస్ అవుతోన్న ఫ్యాన్స్.. !

Singer Sunitha : సింగర్ సునీత తాజాగా ఇన్ స్టా లో పెట్టిన ఒక వీడియో పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.. అంతేకాదు ఇలాంటి వీడియోలు అసలు పెట్టవద్దు అంటూ కూడా మండిపడుతున్నారు.. అసలు విషయం ఏమిటంటే.. సునీత ప్రతిరోజు తనకు సంబంధించిన ఏదో ఒక ఫోటో లేదా వీడియోను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆమె పెట్టే పోస్ట్ ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పటిలాగే ఈరోజు కూడా సునీత ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ పోస్ట్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తాను ఉండే ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వచ్చిన సునీత ఈరోజు తాను వీడియోలో కనిపించకుండా గులాబీ చెట్టుకు విరివిగా విరబూసిన పువ్వులను మాత్రమే చూపిస్తూ వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నప్పటికీ.. అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారు.

dont-post-like-these-videos-fans-serious-on-suneetha
dont-post-like-these-videos-fans-serious-on-suneetha

అభిమానులు ఫైర్ అయ్యేంతగా ఏముంది ఈ వీడియోలో అంటే సునీత లేకపోవడమే.. ప్రస్తుతం వారిని హర్ట్ చేసినట్లు తెలుస్తోంది.. “మీరు కనపడాలి కానీ మీరు లేకుండా ఉండే ఏ ఫోటో కూడా మాకు అక్కర్లేదు ..దయచేసి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయకండి ” అంటూ తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సునీత ముఖాన్ని చూడడానికి అభిమానులు ఎంతగా ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సునీత ఒకవైపు సింగర్ గా.. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాదు అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్న సునీత ఈ మధ్యకాలంలోనే రాయభారమై అనే ఒక వన్ మినిట్ మ్యూజిక్ ఆల్బమ్ వదిలి విపరీతంగా సక్సెస్ పొందింది. త్వరలో మరొక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.